Kaloji Health University: ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీలో ఈనెల 11న రెండోవిడత కేటాయింపుల్లో సీట్లు పొంది.. కళాశాలలో చేరని అభ్యర్థులకు కాళోజీ ఆరోగ్యవిశ్వవిద్యాలయం మరో అవకాశం కల్పించింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఈనెల 24 సాయంత్రం 5 గంటల వరకూ కేటాయించిన కళాశాలల్లో చేరడానికి అనుమతించినట్లు విశ్వవిద్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
వాస్తవానికి విద్యార్థులు చేరడానికి ఈనెల 16 వరకూ గడువు విధించగా వేర్వేరు కారణాల వల్ల కొందరు విద్యార్థులు కళాశాలల్లో చేరలేదు. ఆయా విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం ఆదేశాల మేరకు తాజా నిర్ణయం తీసుకున్నట్లు కాళోజీ వర్సిటీ తెలిపింది. ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్లకు మాప్‌అప్ విడత ప్రవేశ ప్రక్రియ నిర్వహించనున్నారు. ఈ సీట్లకు ఇప్పటికే రెండు విడతల్లో కౌన్సెలింగ్ పూర్తయింది. ఇప్పటికీ ఇందులో మిగిలిన సీట్లను మాప్‌అప్ రౌండ్‌లో భర్తీ చేస్తారు. విద్యార్థులు ఈనెల 24 సాయంత్రం 6 గంటల నుంచి 26 మధ్యాహ్నం 1 గంట వరకూ వెబ్‌ఆప్షన్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
ఇదీ చదవండి: Recruitment: ఉద్యోగాల భర్తీకి ఆర్థికశాఖ ఉత్తర్వులు.. ఆ రెండు శాఖల్లోనే అధికం