Kalogji Varsity Notification for MBBS,BDS Convener quota seats: ఎంబీబీఎస్,బీడీఎస్ కోర్సుల్లో యాజమాన్య కోటా సీట్ల రిజిస్ట్రేషన్‌కు కాళోజీ వర్శిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకోని వారి అభ్యర్థన మేరకు ప్రభుత్వం మరో అవకాశం కల్పిస్తున్నట్టు ప్రకటనలో పేర్కొంది. యాజమాన్య కోటా ఎంబీబీఎస్,బీడీఎస్ సీట్లకు ఇప్పటికే మూడు విడతల కౌన్సిలింగ్ పూర్తయింది. రిజిస్ట్రేషన్ చేసుకోని అభ్యర్థులకు మరో అవకాశం కలిపించాలని విద్యార్థుల తల్లిదండ్రులు వర్సిటీకి, ప్రభుత్వానికి నివేదించారు. ఈ నేపథ్యంలో కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం స్ట్రేవేకెన్సీ రౌండ్ రిజిస్ట్రేషన్‌కు ప్రకటన విడుదల చేసింది. అభ్యర్థులు నేరుగా ఈ నెల 17 తేదీన కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్‌లోని హెల్ప్‌లైన్ సెంటర్లో ఉదయం 9 గంటల నుంచి సాయింత్రం 4 గంటల వరకు సంబంధిత ధ్రువపత్రాలతో హాజరు కావలని స్పష్టం చేసింది.
ఇవీ చదవండి :