కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనకు హైదరాబాద్ నుంచి తెలంగాణ టూరిజం బస్సులు నడపనుంది. ప్రత్యేక ప్యాకేజీ బ్రోచర్‌ను పర్యాటక శాఖా మంత్రి శ్రీనివాస్ గౌడ్ సచివాలయంలో ఇవాళ ఆవిష్కరించారు. 45 లక్షల ఎకరాలకు సాగునీరును అందించే మేడిగడ్డ జలాశయం, కాళేశ్వరం ప్రాజెక్టును చూడాలని చాలా మంది ఆశపడుతున్నారని తెలిపారు. కాళేశ్వరం ఆలయం, మేడిగడ్డ ఆనకట్ట, కన్నెపల్లి పంప్ హౌస్, అన్నారం ఆనకట్ట, భద్రాద్రి ఆలయం కలుపుతూ ప్యాకేజీ రూపొందించినట్లు చెప్పారు. రేపట్నుంచి పర్యాటక సంస్థ బస్సులు నడుపుతున్నదని చెప్పారు. అక్కడ సౌకర్యాలు ఏర్పాటు చేశామని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో త్వరలోనే బోటింగ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టునూ త్వరలోనే పర్యాటకులకు అందుబాటులోకి తెస్తామని మంత్రి తెలిపారు.
ఇదీ చూడండి: శ్రీశైలంకు నిలకడగా ప్రవాహం... సాయంత్రం నీటి విడుదల..!