ETV Bharat / state

'50 టీఎంసీలు దాటిన కాళేశ్వరం ఎత్తిపోత జలాలు' - Kaleshwaram Medigadda Kannepalli

కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎత్తిపోసిన జలాలు 50 టీఎంసీలను దాటాయి. మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీ జలాశయం నుంచి ఇప్పటి వరకు 50కి పైగా టీఎంసీల నీటిని ఎగువకు ఎత్తిపోశారు.

Kaleshwaram Water
Kaleshwaram Water
author img

By

Published : Feb 29, 2020, 11:30 PM IST

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోసే జలాలు నేటి ఉదయం 50 టీఎంసీలను దాటాయి. మేడిగడ్డ వద్ద లక్ష్మీ జలాశయంలో నిల్వ చేసిన జలాలను కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా 2109 జులై ఆరో తేదీ నుంచి దశల వారీగా ఎత్తిపోస్తున్నారు. మొదటి దశలో జులై ఆరు నుంచి 30 వరకు 11.88 టీఎంసీల నీటిని... రెండో దశలో నవంబర్ 19 నుంచి 28వ తేదీ వరకు 25.11 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. మూడోసారి ఫిబ్రవరి 15వ తేదీ నుంచి 18వరకు 4.29 టీఎంసీల జలాలను ఎగువకు తరలించారు.

ప్రస్తుతం నాలుగో విడతలో భాగంగా ఈ నెల 21వ తేదీ నుంచి నీటిఎత్తిపోత కొనసాగుతోంది. ఇవాళ ఉదయం వరకు 9.15 టీఎంసీల నీటిని ఎగువకు తరలించడం వల్ల... కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఉదయం 8 గంటల వరకు మొత్తం 50.44 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. 6619 గంటల పాటు పంపులు పనిచేశాయి. ప్రస్తుతం అక్కడ నాలుగు పంపుల ద్వారా జలాలను ఎగువకు తరలిస్తున్నారు. లక్ష్మీ జలాశయం నుంచి నీటిని దశల వారీగా సరస్వతి, పార్వతి, శ్రీపాదఎల్లంపల్లి, నంది, మధ్యమానేరు, దిగువ మానేరు జలాశయాలకు ఎత్తిపోస్తున్నారు.

'50 టీఎంసీలు దాటిన కాళేశ్వరం ఎత్తిపోత జలాలు'

ఇదీ చదవండి: ప్రతి నీటి బొట్టు అమూల్యమైనదే: మంత్రి కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.