ETV Bharat / state

కరోనాతో 'కైలాసగిరి' కుదేలు.. ఇప్పుడిప్పుడే పూర్వ వైభవం - విశాఖ జిల్లా తాజా వార్తలు

ఎత్తైన కొండ. కనువిందు చేసే పచ్చదనం. శివపార్వతుల విగ్రహాల పాదల చెంత అందమైన ఉద్యానవనం. ప్రకృతి అందాలను కళ్లకు కట్టినట్లు చూపించే వ్యూపాయింట్లు. ఈ ప్రత్యేకతలన్నీ ఏపీలోని విశాఖ కైలాసగిరి సొంతం. సాగరనగరిని సందర్శించే వారెవరైనా.. కైలాసగిరి ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదిస్తూ పులకిస్తుంటారు. కరోనా దెబ్బకు కుదేలైన కైలాసగిరి పర్యాటకం.. ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది.

కరోనా దెబ్బకు కుదేలైన కైలాసగిరి..ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పర్యాటకం

author img

By

Published : Jan 19, 2021, 11:32 AM IST

ఏపీలోని విశాఖ నగరంలో అనేక సందర్శనీయ ప్రదేశాలున్నా.. కైలాసగిరి ప్రత్యేకత వేరు. పని మీద విశాఖ వచ్చిన వారు కైలాసగిరిని సందర్శించే వెళ్తుంటారు. కొండ పైనున్న వ్యూపాయింట్లు పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తుంటాయి. లాక్‌డౌన్‌ వల్ల కళతప్పిన కైలాసగిరికి.. సందర్శకుల తాకిడి ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. పర్యాటక శోభతో ఆకట్టుకుంటోంది.

పర్యాటకులు రాక పెరగటంతో వ్యాపారుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. లాక్‌డౌన్‌ వల్ల తీవ్రంగా నష్టపోయామని.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామని వ్యాపారులు చెబుతున్నారు. కైలాసగిరిని మరింత సుందరంగా తీర్చిదిద్దే దిశగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. పర్యాటకులకు ఇబ్బంది లేకుండా పనులు చేపడుతున్నారు.

కరోనా దెబ్బకు కుదేలైన కైలాసగిరి..ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పర్యాటకం

ఇదీ చదవండి: కూలీలపైకి దూసుకెళ్లిన ట్రక్కు-15 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.