గోదావరి వరద గురించి తెలిసిన వారెవ్వరూ తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు ప్రాంతానికి వెళ్లరు. ఎందుకంటే అక్కడ పడవలు నడపటానికి అనువుగా ఉండే ప్రదేశం కాదు. ఆ ప్రాంతంలో వరద సమయంలో గోదారమ్మ ఉద్ధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది. 30 సంవత్సరాల నుంచి నివసిస్తున్న స్థానికులు సైతం గోదారమ్మ ఉగ్రరూపం దాల్చినప్పుడు లోనికి వెళ్లరు. ఈ విషయం తెలిసీ... వశిష్ఠ బోటు నిర్వాహకులు మాత్రం పర్యటకులను తీసుకెళ్లారు. స్థానికులైన కచ్చులూరు ప్రజలు వెంటనే పడవలు తీసుకుని వెళ్లి ప్రాణాలకు తెగించి 25 మందిని కాపాడగలిగారు. మిగిలిన వారి ప్రాణాలను మాత్రం ఎంత ప్రయత్నించినా రక్షించలేకపోయారు. అసలు గోదారమ్మకు వరద వస్తుందని తెలిసిన వెంటనే ప్రమాద ప్రదేశాలకు వెళ్లకపోటం ఉత్తమమని స్థానికులు చెప్తున్నారు.
ఇదీ చూడండి: