ETV Bharat / state

KA PAUL: 'వచ్చే ఎన్నికల్లో 175 లోక్​సభ స్థానాల్లో పోటీ' - ka paul latest news

KA PAUL: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్​ కేంద్రమంత్రి అమిత్‌ షాతో శుక్రవారం దిల్లీలో భేటీ అయ్యారు. ఆంధ్ర, తెలంగాణతో పాటు దేశ అప్పులపై అమిత్‌షాతో చర్చించినట్లు పాల్‌ తెలిపారు. ఈ సందర్భంగానే వచ్చే ఎన్నికల్లో ఒక్క హైదరాబాద్‌ పార్లమెంట్‌ స్థానం మినహా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోని అన్ని లోక్‌సభ స్థానాల్లో గెలుస్తామన్న ఆయన.. దక్షిణ భారత రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాల్లోని 175 స్థానాల్లోనూ పోటీ చేయనున్నట్లు వెల్లడించారు.

KA PAUL: 'వచ్చే ఎన్నికల్లో 175 లోక్​సభ స్థానాల్లో పోటీ'

author img

By

Published : May 14, 2022, 8:46 AM IST

KA PAUL: వచ్చే ఎన్నికల్లో ఒక్క హైదరాబాద్‌ పార్లమెంట్‌ స్థానం మినహా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోని అన్ని లోక్‌సభ స్థానాల్లో గెలుస్తామని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ అన్నారు. అలాగే దక్షిణ భారత రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాల్లోని 175 స్థానాల్లోనూ పోటీ చేయనున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ పనైపోయిందని.. ప్రతిపక్ష స్థానాన్ని తామే భర్తీ చేస్తామన్నారు. ఆంధ్ర, తెలంగాణతో పాటు దేశ అప్పులపై కేంద్ర మంత్రి అమిత్‌షాతో చర్చించినట్లు కేఏ పాల్‌ తెలిపారు. కేంద్ర మంత్రి అమిత్‌ షాతో భేటీ అనంతరం కేఏ పాల్‌ మాట్లాడారు.

'ఏపీ అప్పులు రూ.8 లక్షల కోట్లు.. తెలంగాణ రాష్ట్ర అప్పులు రూ.4.50 లక్షల కోట్లుగా ఉంది. భారత్‌ అప్పులు చూస్తే రూ.కోటి లక్షలకు చేరింది. కేవలం రూ.3.50 లక్షల కోట్లు అప్పు చేసిన శ్రీలంక ఇవాళ దివాళా తీసింది. ఇందుకు కుటుంబ పాలన కూడా ఒక కారణం. కేసీఆర్‌ కుటుంబం 8 ఏళ్లుగా రాష్ట్రాన్ని పాలిస్తోంది. రూ.7 లక్షల కోట్లు ఏమయ్యాయో కేసీఆర్‌, కేటీఆర్ చెప్పరు. దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలు, ఆంధ్రా, తెలంగాణ అప్పులపై అమిత్‌ షాతో చర్చించాను. నాపై జరిగిన దాడిని అమిత్‌ షా తీవ్రంగా ఖండించారు. ఆంధ్రప్రదేశ్‌కు నిధులు లేవు.. ఇవ్వండని అమిత్‌ షాను కోరాను. ఆంధ్రప్రదేశ్‌లో భాజపా, జనసేనకు ఎలాంటి ఓటు బ్యాంక్ లేదు. ఓటు బ్యాంక్‌ లేని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వెంట ఎందుకు పడుతున్నారని కేంద్ర మంత్రిని అడిగాను. మేం ఆయన వెంట పడటమేంటి.. ఆయనే మా వెంట పడుతున్నారని అమిత్‌ షా చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌ మినహా అన్ని ఎంపీ స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లాను. ఇక ప్రజలే నిర్ణయిస్తారు' అని కేఏ పాల్‌ పేర్కొన్నారు.

ఇవీ చూడండి:

తెరాస నన్ను చంపించడానికి ప్రయత్నిస్తోంది: కేఏ పాల్‌

కేటీఆర్​కు సీఎం పదవి తప్పా ఏదీ కావాలన్నా ఇస్తాం: కేఏ పాల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.