KA Paul Meets Revanth Reddy in Hyderabad : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని (CM Revanth Reddy), ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మర్యాద పూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జనవరి 30న జరిగే ప్రపంచ శాంతి సదస్సుకు రేవంత్ రెడ్డిని ఆహ్వానించినట్లు కేఏ పాల్ తెలిపారు. గ్లోబల్ పీస్ సదస్సుకు కావాల్సిన అనుమతులను సైతం మంజూరు చేయాల్సిందిగా కేఏ పాల్ కోరారు.
అందుకు సీఎం సానుకూలంగా స్పందించినట్లు వెల్లడించారు. అనంతరం ఈ విషయాన్ని కేఏ పాల్ తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా సదస్సుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) సహా పలువురు కేంద్ర మంత్రులను సైతం ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు. ఈ సదస్సుకు పలు దేశాల నుంచి వేల మంది ప్రతినిధులు హాజరవ్వనున్నట్లు వెల్లడించారు.
Hyderabad CP Srinivas Reddy Meet with CM Revanth : సచివాలయంలో హైదరాబాద్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. హైదరాబాద్ కమిషనర్‌గా నియమితులైన ఆయన, ఉదయం బాధ్యతలు(Responsibilities) స్వీకరించారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
సీఎం రేవంత్‌కు స్వల్ప అస్వస్థత - కరోనా పరీక్ష చేయనున్న వైద్యులు
రాష్ట్రంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు - ఇంటర్ బోర్డు కార్యదర్శిగా శ్రుతి ఓజా