ETV Bharat / state

KA Paul House Arrest: కేఏ పాల్‌ను హౌస్‌ అరెస్ట్‌ చేసిన పోలీసులు.. ఎందుకంటే? - KA PAUL HOUSE ARRESTED

KA Paul House Arrest: కేఏ పాల్​ను హైదరాబాద్‌ పోలీసులు గృహనిర్భంధం చేశారు. సోమవారం తనపై జరిగిన దాడి గురించి డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు వెళ్తోన్న పాల్‌ను పోలీసులు హౌస్‌ అరెస్ట్ చేశారు.

KA Paul House Arrest:
కేఏ పాల్‌ హౌస్‌ అరెస్ట్‌ చేసిన పోలీసులు.. ఎందుకంటే?
author img

By

Published : May 3, 2022, 3:38 PM IST

Updated : May 3, 2022, 3:58 PM IST

KA Paul House Arrest: ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్​ను పోలీసులు గృహనిర్భంధం చేశారు. డీజీపీ మహేందర్​ రెడ్డిని కలిసేందుకు ఇంటి నుంచి కేఏ పాల్‌ బయలుదేరారు. ఈ క్రమంలో పోలీసులు.. కేఏ పాల్‌ను ఇంటి వద్దనే అడ్డుకున్నారు. అనుమతి లేదని హౌస్ అరెస్ట్ చేశారు. సోమవారం తనపై జరిగిన దాడి గురించి డీజీపీకి ఫిర్యాదు చేస్తానని.. అందుకే వెళ్తున్నట్లు చెప్పినప్పటికీ.. పోలీసులు ఆయన్ని గృహనిర్భంధం చేశారు.

అసలు సోమవారం ఏం జరిగిందంటే.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను పరామర్శించడానికి కేఏ పాల్‌ వెళ్తుండగా.. ఆయనపై తెరాస నేత చేయి చేసుకున్నారు. సిద్దిపేట జిల్లా జక్కపూర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కేఏపాల్‌ పర్యటనకు అనుమతి లేదని.. జిల్లాకు రాకుండా పోలీసులు అడ్డుకొనే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న తెరాస శ్రేణులు అక్కడికి చేరుకున్నారు.

కేఏ పాల్ పోలీసులతో మాట్లాడుతుండగానే అక్కడే ఉన్న ఓ తెరాస నేత పాల్ చెంప పగలగొట్టారు. కేఏ పాల్ చెంపపై కొట్టడంతో గందరగోళం నెలకొంది. అక్కడున్న వారు ఆ వ్యక్తిని అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తతంగా మారకుండా.. ఇరువర్గాలను పోలీసులు అడ్డుకున్నారు. వెంటనే పోలీసులు కేఏ పాల్‌ను తన వాహనంలో ఎక్కించి హైదరాబాద్ వైపు తరలించారు. ఈ విషయమై మంగళవారం(నేడు) కేఏ పాల్‌ డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు వెళ్తుండగా.. పోలీసులు గృహనిర్భంధం చేశారు.

ఇవీ చూడండి:

Last Updated : May 3, 2022, 3:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.