ETV Bharat / state

అంబేడ్కర్ పేరు పెట్టి.. కేసీఆర్ బర్త్‌డే నాడు ఎలా ప్రారంభిస్తారు: కేఏ పాల్​

KA Paul Was Angry With BRS: డాక్టర్​ బీఆర్​ అంబేడ్కర్​ పుట్టినరోజు నాడే నూతన సచివాలయాన్ని ప్రారంభించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్​ డిమాండ్​ చేశారు. ఆ రోజున కాకుండా ఫిబ్రవరి 17న ప్రారంభిస్తే సచివాలయ ముట్టడి తప్పదని కేఏ పాల్​ హెచ్చరించారు. హైదరాబాద్​లోని అమీర్​పేట్​లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

ka paul
కేఏ పాల్​
author img

By

Published : Jan 31, 2023, 10:45 PM IST

KA Paul Was Angry With KCR: తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభోత్సవం ఏప్రిల్ 14న అంబేడ్కర్ పుట్టిన రోజున చేయాలని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్​ డిమాండ్​ చేశారు. సీఎం కేసీఆర్​, బీఆర్​ఎస్​ పార్టీపై ధ్వజమెత్తారు. హైదరాబాద్​లోని అమీర్​పేట్​లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్​ రాక్షస పాలన సాగుతోందని కేఏ పాల్​ మండిపడ్డారు. దళితుల ఓట్లు సంపాదించేందుకే సీఎం కేసీఆర్​ 125 అడుగుల అంబేడ్కర్​ విగ్రహాన్ని నిర్మిస్తున్నారని ఆరోపించారు.

బీఆర్​ఎస్​ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న కేఏ పాల్​

సచివాలయాన్ని డాక్టర్​ బీఆర్​ అంబేడ్కర్​ పుట్టినరోజు మాత్రమే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అంబేడ్కర్​ పేరు పెట్టి నూతన సచివాలయాన్ని కేసీఆర్​ పుట్టినరోజు నాడు ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నించారు. కేసీఆర్​ పుట్టిన రోజునే ప్రారంభిస్తే.. సచివాలయానికి కేసీఆర్​ భవన్​ అని పేరు పెట్టవచ్చు కదా అని తెలిపారు. సీఎం కేసీఆర్​ తనను తాను జాతిపిత అని చెప్పుకుంటూ తన పుట్టినరోజున ప్రారంభించాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో అయినా అంబేడ్కర్​ పుట్టినరోజునే సచివాలయాన్ని ప్రారంభించాలని తీర్మానించారు.

రాష్ట్రం రూ.5 లక్షల కోట్లు అప్పుల ఊబిలో ఉంటే సీఎం కేసీఆర్​ నూతన సచివాలయం నిర్మించారని దుయ్యబట్టారు. ఫిబ్రవరి17నే సచివాలయం ప్రారంభిస్తే అంబేడ్కర్​ అనుచరులు సచివాలయ ముట్టడికి పూనుకోవాలని పిలుపునిచ్చారు. హైకోర్టు ఎన్ని మొట్టికాయలు వేసిన ఈ ప్రభుత్వం తీరు మారదని ఘాటుగా విమర్శించారు. తాను హైకోర్టులో పిటిషన్ వేయడం​ వల్లే కామారెడ్డి మాస్టర్​ ప్లాన్​ రద్దయ్యిందని ఈ సందర్భంగా తెలిపారు. దళితుడిని సీఎం చేస్తానన్న సీఎం మాట తప్పారని కేఏ పాల్​ అన్నారు. యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారని.. ఆ హామీ ఏమైపోయిందని ప్రశ్నించారు.

"అంబేడ్కర్​ పుట్టినరోజు ఏప్రిల్​ 14న నూతన సచివాలయం ప్రారంభించాలి. అంబేడ్కర్​ను హీనపరిచి మీరు మీ పుట్టినరోజు(కేసీఆర్​)న ఫిబ్రవరి17న ఇంకా పూర్తికానీ సచివాలయాన్ని ఎందుకు ప్రారంభిస్తున్నారు చెప్పాలి. ఇంకా డైరెక్టుగా కేసీఆర్​ భవన్​ అని పెట్టుకోవచ్చు కదా? మీరు దళితుల్ని సీఎంలు చేస్తానన్నారు. మాట తప్పారు. రైతులు మీద దాడులు ఆపండి అని నిన్ననే హైకోర్టులో మొట్టికాయలు పడ్డాయి. ఫిబ్రవరి17నే సచివాలయం ప్రారంభిస్తే అంబేడ్కర్​ అనుచరులు సచివాలయ ముట్టడికి పూనుకోవాలి." - కేఏ పాల్​, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.