జ్యోతిరావు పూలే 195వ జయంతిని పురస్కరించుకుని అంబర్పేట్లోని అలీ కేఫ్ చౌరస్తాలో ఉన్న పూలే విగ్రహం వద్ద జయంత్యుత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఈటల రాజేందర్, అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు, భాజపా పార్టీ నాయకులు డాక్టర్ లక్ష్మణ్, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, టీటీడీపి రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ పాల్గొని పూమాలలు వేసి నివాళులు అర్పించారు.
సంఘ సంస్కర్త, అణగారిన వర్గాల జీవితాల్లో విద్యా జ్యోతిని వెలిగించిన సమసమాజ అభివృద్దికి పాటు పడ్డ మహానీయుడు జ్యోతిరావ్ పూలే అని నేతలు కొనియాడారు. పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. మహాత్మపూలే శిష్యరికంలో... అంబేడ్కర్ ప్రపంచం మొత్తాన్ని పరిశోధన చేసి ఒక అత్యున్నత రాజ్యాంగాన్ని మనకు అందించారని గుర్తు చేశారు. జ్యోతిరావు పూలేకి నివాళిగా అంబర్పేట్లోని 6వ నెంబర్ సర్కిల్లో కొంత ప్రభుత్వ స్థలం ఉందని.. దానిలో జ్యోతి రావు పూలే పేరు మీదుగా ఆడిటోరియం నిర్మించాలని వీహెచ్ కోరారు.
ఇదీ చూడండి: సాగర్లో ప్రత్యేక వ్యూహం... సామాజికవర్గాల వారిగా పార్టీల ప్రచారం