తలసీమియా బాధితులకు తరచూ రక్తమార్పిడి చేయాల్సి ఉంటుంది. లాక్‌డౌన్ నేపథ్యంలో రక్తం కొరత ఏర్పడిందన్న వార్తను పత్రికల్లో చదివిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరాం చలించి తనవంతుగా రక్తదానం చేయాలని నిర్ణయించుకున్నారు. రక్తదానం చేయడానికి వెళుతుండగా డ్రైవర్ కుమార్తె కూడా ముందుకు వచ్చారు. శివరాంపల్లిలోని తలసీమియా అండ్ సికెల్ సెల్ సొసైటీకి వెళ్లి.. ఇద్దరూ రక్తదానం చేశారు.
భద్రతకు వచ్చిన పోలీసు అధికారి రవీంద్రనాయక్ వారిని చూసి రక్తదానం చేశారు. ప్రస్తుతం రక్తం కొరతతో ఇబ్బంది పడుతున్న తలసీమియా బాధితులను ఆదుకోవడానికి న్యాయమూర్తి ముందుకు రావడంపై నిర్వాహకులు అలీంబేగ్ కృతజ్ఞతలు తెలిపారు. వారికి అభినందన పత్రాలు అందజేశారు.
ఇదీ చదవండి: కరోనా కట్టడిలో 'కేరళ మోడల్' సూపర్ హిట్!