తెలంగాణ తొలి మహిళ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లి గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్‌భవన్‌లో రేపు ఉదయం పదకొండున్నర గంటలకు గవర్నర్ తమిళిసై జస్టిస్ హిమా కోహ్లితో ప్రమాణం చేయించనున్నారు. ఇప్పటి వరకు దిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ హిమా కోహ్లిని తెలంగాణ సీజేగా నియమితులయ్యారు.
దిల్లీలో 1959 సెప్టెంబరు 2న జన్మించిన జస్టిస్ హిమా కోహ్లి.. దిల్లీ యూనివర్సిటీలో లా కోర్సు పూర్తి చేసి 1984లో న్యాయవాద వృత్తిలో ప్రవేశించారు. దిల్లీ హైకోర్టులో 2006 నుంచి న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ హిమా కోహ్లి.. ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొంది తెలంగాణ హైకోర్టుకు బదిలీ అయ్యారు. రేపు నూతన సీజే ప్రమాణ స్వీకారం సందర్భంగా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాజ్‌భవన్ పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు ప్రకటించారు.
ఇదీ చదవండి: 'ఏవీ సుబ్బారెడ్డి ఏ1, అఖిలప్రియ ఏ2, ఆమె భర్త ఏ3'