హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్‌క్లబ్‌లో యునైటెడ్ ఇండియా యాక్షన్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో హైకోర్టు విశ్రాంత జడ్జి జస్టిస్ చంద్రకుమార్ పాల్గొన్నారు. దేశంలో రెండవ పౌరులుగా ఏ వర్గం ప్రజలను చూసినా... అది దేశ సమైక్యతకు, ప్రజల మధ్య ఐక్యతకు మంచిది కాదన్నారు. దేశంలో అన్ని మతాల వారు కలిసి మెలసి ఉంటున్నారని... ఏ మతం గొప్పదనే విభేదాలు రావడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని సూచించారు. మతాల మధ్య చిచ్చుపెట్టి విభజించి పాలించే కుట్రలో భాగమే సీఏఏ చట్టమని ఆయన దుయ్యబట్టారు. అందరికి ఆమోదయోగ్యమైన సవరణలు చేయాలని చంద్రకుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
'అందరికి ఆమోదయోగ్యమైన సవరణలు చేయండి' - justice chandra kumar on citizen bill
పౌరులందరూ సమానమని రాజ్యాంగం చెపుతోందని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఓ వర్గ ప్రజల పట్ల వివక్ష చూపుతూ... పౌరసత్వ సవరణ, ఎన్ఆర్సీ బిల్లును రూపొందించిందని వ్యాఖ్యానించారు.