ETV Bharat / state

హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఆర్​ఎస్​ చౌహాన్​​

తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్​ ఆర్​ఎస్ చౌహాన్​ను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్యులు జారీ చేశారు. జస్టిస్​ టీబీఎన్​ రాధాకృష్ణన్​ కోల్​కతాకు బదిలీ అయ్యారు. ఆయన బాధ్యతల నుంచి వైదొలిగిన వెంటనే జస్టిస్​ చౌహాన్​ చేపట్టనున్నారు.

హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఆర్​ఎస్​ చౌహన్​​
author img

By

Published : Mar 28, 2019, 5:58 AM IST

Updated : Mar 28, 2019, 11:06 AM IST

హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఆర్​ఎస్​ చౌహన్​​
తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్​ రాఘవేంద్రసింగ్ చౌహాన్​ను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత చీఫ్ జస్టిస్ టీబీఎన్​ రాధాకృష్ణన్​ కోల్​కతాకు బదిలీ కాగా ఆర్​ఎస్​ చౌహన్​కు తాత్కాలిక బాధ్యతలను అప్పగించారు. జస్టిస్​ టీబీఎన్​ రాధాకృష్ణ బాధ్యతల నుంచి వైదొలిగిన వెంటనే జస్టిస్​ చౌహాన్ చేపట్టాల్సి ఉంటుంది.

న్యాయవాది నుంచి తాత్కాలిక సీజే వరకు

రాజస్థాన్​కు చెందిన జస్టిస్​ చౌహాన్​ 1959 డిసెంబర్ 24న జన్మించారు. 1980లో అమెరికాలోని ఆర్కాడియా విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1983లో దిల్లీ వర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టాపొందారు. 1983 నవంబర్​లో న్యాయవాదిగా బార్​కౌన్సిల్​లో పేరు నమోదు చేసుకున్నారు. రాజస్థాన్​ హైకోర్టులో 1986 నుంచి జూన్​ 2005 వరకు న్యాయవాదిగా... క్రిమినల్​, రాజ్యాంగ, సర్వీసు చట్టాల్లో ప్రాక్టీసు చేశారు. 2005 జూన్​ 13న రాజస్థాన్​ హైకోర్టు శాస్వత న్యాయమూర్తిగా 2015 మార్చి 10న ప్రమాణ స్వీకారం చేశారు.

కర్ణాటక నుంచి గత నవంబర్​లో ఉమ్మడి హైకోర్టు విభజన అనంతరం ఆయన తెలంగాణలోనే కొనసాగుతున్నారు. ప్రస్తుతం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

ఇదీ చూడండి: తెరాస గూటికి కాంగ్రెస్ ఎమ్మెల్యే సురేందర్

Last Updated : Mar 28, 2019, 11:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.