ETV Bharat / state

Ponguleti on BRS Leaders Joinings in Congress : 'ఈ నెలాఖరు నుంచి కాంగ్రెస్‌లోకి బీఆర్‌ఎస్‌ నేతల వలసలు' - భట్టి విక్రమార్కను కలిసిన పొంగులేటి

Ponguleti Met Bhatti : పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని భట్టి నివాసంలో ఇరువురు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పొంగులేటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌ నేతలు పీసీసీ, ఏఐసీసీ నేతలతో టచ్‌లో ఉన్నారని.. నెలాఖరు నుంచి కాంగ్రెస్‌లోకి బీఆర్‌ఎస్‌ నేతల వలసలు ఉంటాయని వ్యాఖ్యానించారు.

Ponguleti on BRS Leaders Joinings in Congress

author img

By

Published : Jul 10, 2023, 2:06 PM IST

Updated : Jul 10, 2023, 3:26 PM IST

Ponguleti Meet with Bhatti : ఇటీవల కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి భట్టి విక్రమార్కను కలిశారు. హైదరాబాద్‌లోని నివాసంలో భట్టితో భేటీ అయ్యారు. పార్టీలో చేరిక అనంతరం తొలిసారి సీఎల్పీ నేతతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాల గురించి చర్చించామని.. పార్టీని అధికారంలోకి తేవడమే తమ ముందున్న లక్ష్యమని భట్టి విక్రమార్క తెలిపారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకువస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ లక్ష్యాలు, ఆకాంక్షలు నెరవేర్చడమే కాంగ్రెస్‌ పార్టీ ఉద్దేశమన్న ఆయన.. బీఆర్‌ఎస్‌ను బంగాళాఖాతంలో కలిపి కాంగ్రెస్‌ను అధికారంలోకి తెస్తామని పునరుద్ఘాటించారు.

ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ తీరు.. కేసీఆర్ పట్ల నేను కొట్టినట్లు చేస్తా.. నువ్వు ఏడ్చినట్లు చెయ్యి అన్నట్లుగా ఉందని ఆరోపించారు. రాష్ట్రంలో ఇప్పుడు రెండే వర్గాలని.. ఒకటి ప్రభుత్వ అనుకూల వర్గం, మరోటి వ్యతిరేక వర్గమని తెలిపారు. ప్రజలు ఈసారి కేసీఆర్‌ను ఇంటికి పంపాలని బలంగా నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో షర్మిల చేరికపై స్పందించిన ఆయన.. ఆ వ్యవహారమంతా పార్టీలోని సీనియర్ నేతలు చూసుకుంటారని, తనకు తెలియదని చెప్పారు.

Ponguleti on BRS Leaders Joinings in Congress : 'ఈ నెలాఖరు నుంచి కాంగ్రెస్‌లోకి బీఆర్‌ఎస్‌ నేతల వలసలు'

నెలాఖరు నుంచి కాంగ్రెస్‌లోకి బీఆర్‌ఎస్‌ నేతల వలసలు..: భవిష్యత్తులో రాష్ట్రంలో రెండు పార్టీలు మాత్రమే మిగులుతాయని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారన్నారు. బీఆర్‌ఎస్‌ నేతలు పీసీసీ, ఏఐసీసీ నేతలతో టచ్‌లో ఉన్నారని.. నెలాఖరు నుంచి కాంగ్రెస్‌లోకి బీఆర్‌ఎస్‌ నేతల వలసలు ఉంటాయని స్పష్టం చేశారు.

Jupalli Krishna Rao Met Bhatti Vikramarka : కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు చేరిక.. రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడుతుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. జూపల్లి కాంగ్రెస్‌లో చేరుతున్నందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. జూపల్లి నేడు భట్టి విక్రమార్కును ఆయన నివాసంలో కలిశారు. కొల్లాపూర్‌లో జరగబోయే బహిరంగ సభకు రావాలని భట్టిని ఆహ్వానించారు.

ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ నేతలు, కార్యకర్తలు కొల్లాపూర్‌ బహిరంగ సభకు భారీగా కదిలి రావాలని భట్టి విజ్ఞప్తి చేశారు. ఆ సభకు ప్రియాంగ గాంధీ వస్తారని.. ఆమె షెడ్యూల్‌ను పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ మాణిక్‌రావు ఠాక్రే ప్రకటిస్తారని భట్టి తెలిపారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మహబూబ్‌నగర్ జిల్లా నేతలందరం కలిసి మాట్లాడుకున్నామని.. అన్ని నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్‌లోకి చేరికలు ఉంటాయని జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. తనతో పాటు కూచుకుల్ల దామోదర్ రెడ్డి, ఆయన కుమారుడు మేఘారెడ్డితో పాటు చాలా మంది నేతలు కొల్లాపూర్‌ బహిరంగ సభలో కాంగ్రెస్‌లో చేరుతారని స్పష్టం చేశారు.

'కాంగ్రెస్ పార్టీలో జూపల్లి చేరిక.. రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడుతుంది. జూపల్లి కాంగ్రెస్‌లో చేరుతున్నందుకు ఆయనకు ధన్యవాదాలు. కొల్లాపూర్‌లో జరిగే బహిరంగ సభకు ప్రియాంకగాంధీ హాజరవుతారు. ఆమె షెడ్యూల్‌ను పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ మాణిక్‌రావు ఠాక్రే ప్రకటిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ నేతలు, కార్యకర్తలు కొల్లాపూర్‌ బహిరంగ సభకు భారీగా కదిలి రావాలి.' - భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత

ఇవీ చూడండి..

Ponguleti Joins in Congress : 'బీఆర్​ఎస్​ను బంగాళాఖాతంలో కలపాలంటే.. అది కాంగ్రెస్‌తోనే సాధ్యం'

Rajagopal Reddy meets Ponguleti : కాంగ్రెస్​లోకి కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి.?

Last Updated : Jul 10, 2023, 3:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.