ETV Bharat / state

జూబ్లీహిల్స్ వీహెచ్​పీ కమిటీ నియామకం.. హాజరైన నాగబాబు, జీవిత రాజశేఖర్ - ప్రముఖ సినీనటులు జీవిత రాజశేఖర్

ఇవాళ హైదరాబాద్​లోని​ జూబ్లీహిల్స్ శాఖ విశ్వహిందూ పరిషత్ కమిటీని ప్రకటించారు. ఫిల్మ్​నగర్​ సాయిబాబా ఆలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీనటులు జీవిత రాజశేఖర్, కొణిదెల నాగబాబు, సినీ రచయిత బుర్రా సాయి మాధవ్ పాల్గొన్నారు.

jubleehills vhp committee
హైదరాబాద్​లోని​ జూబ్లీహిల్స్ వీహెచ్​పీ కార్యక్రమంలో పాల్గొన్న కొణిదెల నాగబాబు
author img

By

Published : Sep 8, 2021, 9:36 PM IST

Updated : Sep 8, 2021, 9:43 PM IST

రాష్ట్ర విశ్వహిందు పరిషత్ అధ్యక్షులు రామరాజు అధ్యక్షతన హైదరాబాద్ జూబ్లీహిల్స్​లో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ శాఖ విశ్వహిందు పరిషత్ కమిటీని ప్రకటించారు. ఫిల్మ్​నగర్​లోని సాయిబాబా ఆలయంలో జరిగిన ఈ సమావేశంలో ప్రవా సాయి సత్యనారాయణ శర్మ కమిటీ అధ్యక్షులుగా, సంకాబత్తుల రాజశేఖర్ ఉపాధ్యక్షులుగా, దాసరి పూర్ణచంద్రరావు కార్యదర్శిగా, మంతాపురం శ్రావణకుమార్ అప్పా ఉపకార్యదర్శిగా, పొన్నపల్లి ప్రశాంత్ కుమార్ కార్యవర్గ సభ్యులుగా బాధ్యతలు స్వీకరించారు.

jubleehills vhp committee
జూబ్లీహిల్స్ వీహెచ్​పీ కమిటీ నియామకంలో పాల్గొన్న జీవిత రాజశేఖర్

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ సినీ నటులు కొణిదెల నాగబాబు, జీవిత రాజశేఖర్, సినీ రచయిత బుర్రా సాయి మాధవ్ హాజరయ్యారు. అనంతరం కార్యవర్గ సభ్యులకు కొణిదెల నాగబాబు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సంఘటన మంత్రి యాదిరెడ్డి, మహా నగర అధ్యక్షులు కోడె శ్రీనివాస రాజు, వీహెచ్​పీ హిందీ నగర జిల్లా కార్యదర్శి గిరిధర్, భజరంగ్ దళ్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ శివరాములు, కందుకూరి రామారావు, గుమ్ములూరి శ్రీనివాసరావు, విస్సా వజ్జుల మల్లిఖార్జున శర్మ, విశ్వహిందు పరిషత్ కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: విశ్వహిందూ పరిషత్​​ అధ్యక్షుడిగా రవీంద్ర నారాయణ్​

Last Updated : Sep 8, 2021, 9:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.