ETV Bharat / state

BJP Presidents Meeting Hyderabad : 'దక్షణాది రాష్ట్రాల్లో బీజేపీ బలోపేతమే లక్ష్యం' - తెలంగాణ బీజేపీ

BJP High Command Focus On South States : ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేలా.. ఇప్పుడే ఎన్నికలు అన్నట్టుగా.. పటిష్ఠమైన కార్యాచరణ, ప్రణాళికతో బీజేపీను సంసిద్ధం చేయాలని అధిష్ఠానం స్పష్టం చేసింది. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ బలోపేతమే లక్ష్యంగా జాతీయ నాయకత్వం ఎజెండాను నిర్దేశించింది. ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న తెలంగాణ, వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే ఏపీతో పాటు లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అత్యధిక స్థానాలు సాధించడం అవసరమని స్పష్టం చేసింది.

BJP Presidents Meeting In Hyderabad
BJP Presidents Meeting In Hyderabad
author img

By

Published : Jul 10, 2023, 7:15 AM IST

'దక్షణాది రాష్ట్రాలలో బీజేపీ బలోపేతమే లక్ష్యం'

JP Nadda Meets BJP State in Charges : హైదరాబాద్‌లోని బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో దక్షిణాది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అధ్యక్షులు, పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్​లు, హాయ ఇన్‌ఛార్జ్​లతో సమావేశం జరిగింది. సంస్థాగతంగా క్షేత్రస్థాయి నుంచి పార్టీని పటిష్ఠం చేయాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అగ్రనేత బీఎల్‌ సంతోశ్​లు సూచించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయడంపై ప్రధానంగా చర్చించారు. రాష్ట్రాల వారీగా సమీక్షించిన నేతలు.. దక్షిణాది రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులు, ఎన్నికలు, పార్టీని బలోపేతం చేయడం, విజయం సాధించేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు.

BJP Focus On Telangana Assembly Elections 2023 : ప్రధానంగా బూత్‌ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడంలో కీలకమైన బూత్‌ కమిటీల ఏర్పాటుపై చర్చించారు. ఉత్తరాది రాష్ట్రాల్లో విజయవంతమవుతున్న పార్టీ వ్యూహాలు దక్షిణాది రాష్ట్రాల్లో ఎందుకు ఆశించిన ఫలితాలివ్వడంలేదనే అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. ఇటీవల కర్ణాటక ఎన్నికల్లో అధికారంలో ఉన్నా ఓటమి పాలుకావడం.. ఇతర దక్షిణాది రాష్ట్రాలపై ప్రభావం చూపుతోందని జాతీయ నాయకత్వం తెలిపింది. దీనిని ఎదుర్కోవడానికి అవసరమైన అంశాలను సిద్ధం చేయాలని పార్టీ అధ్యక్షులకు జాతీయ నాయకత్వం సూచించింది.

BJP High Command Focus On South States : జాతీయస్థాయి నుంచి చేపట్టే కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంలో కొన్ని రాష్ట్రాలు ముందుండగా.. మరికొన్ని ఉదాసీనంగా వ్యవహరించడం సరికాదని జాతీయ నేతలు తెలిపారు. ప్రతి కార్యక్రమం నిర్దేశించిన మేరకు జరగాలని ఇందుకు రాష్ట్ర ఇన్‌ఛార్జ్​లు పూర్తి బాధ్యత వహించాలన్నారు. తొమ్మిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలు, పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా పార్టీకి సానుకూలత పెరుగుతుందని గుర్తించాలన్నారు. తొమ్మిదేళ్లలో అభివృద్ధి, ప్రతి రాష్ట్రానికి కలిగిన ప్రయోజనాలు, అమలైన ప్రాజెక్టులు, వ్యయం చేసిన నిధుల వంటి అంశాలను ప్రజలకు వివరించడం కీలకమని తెలిపారు.

Telangana Assembly Elections 2023 : ఈ సమావేశంలో తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రత్యేకంగా చర్చించారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని కిషన్‌రెడ్డి వివరించారు. అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్‌లను దీటుగా ఎదుర్కొనేలా కార్యాచరణ ఉండాలని నిర్ణయించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని హామీలు, ప్రధానంగా యువతను లక్ష్యంగా చేసుకుని చేపట్టాల్సిన కార్యక్రమాల అజెండాను సిద్ధం చేయాలన్నారు.

బీజేపీ, బీఆర్ఎస్​లు ఒకటేనంటూ కాంగ్రెస్‌ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలి : కేంద్రం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలతో రాష్ట్రానికి కలిగిన ప్రయోజనాలు, రాష్ట్ర ప్రభుత్వం సహకరించని అంశాలకు విస్తృత ప్రచారం అవసరమన్నారు. బీజేపీ, బీఆర్ఎస్​లు ఒకటేనంటూ కాంగ్రెస్‌ చేస్తున్న ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఏడాది ఎన్నికల నేపథ్యంలో పార్టీ తాజా పరిస్థితిని సమీక్షించుకుని రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, రాష్ట్ర ఇన్‌ఛార్జి దీనిపై దృష్టి సారించాలని సూచించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.