ETV Bharat / state

మంత్రి గంగుల సహా గ్రానైట్‌ వ్యాపారుల ఇళ్లల్లో ఐటీ, ఈడీ సోదాలు.. రూ.50 కోట్లు సీజ్‌ - హైదరాబాద్​లో ఈడీ సోదాలు తాజా వార్తలు

ED and IT Raids: రాష్ట్రంలో ఈడీ, ఐటీ సంయుక్త సోదాలు కలకలంరేపుతున్నాయి. హైదరాబాద్‌, కరీంనగర్‌లో ఏకకాలంలో అధికారుల తనిఖీలు నిర్వహిస్తున్నారు. మంత్రి గంగుల కమలాకర్‌తో పాటు గ్రానైట్ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి.

Joint searches by ED and IT in Hyderabad and Karimnagar

author img

By

Published : Nov 9, 2022, 11:13 AM IST

Updated : Nov 9, 2022, 3:29 PM IST

ED and IT Raids: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆదాయపన్ను (ఐటీ), ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు కరీంనగర్‌లో ఏకకాలంలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మంత్రి గంగుల కమలాకర్‌తో పాటు గ్రానైట్ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని పంజాగుట్టలోని పీఎస్‌ఆర్‌ గ్రానైట్స్‌, హైదర్‌గూడలోని జనప్రియ అపార్ట్‌మెంట్లలో తనిఖీలు నిర్వహించారు. సోమాజీగూడలో గ్రానైట్ వ్యాపారి శ్రీధర్‌ నివాసంలోనూ సోదాలు జరిగాయి.

కరీంనగర్‌లో గంగుల కమలాకర్‌ ఇంటితో పాటు మంకమ్మతోటలో ఆయనకు చెందిన శ్వేత గ్రానైట్‌, కమాన్‌ ప్రాంతంలోని మహవీర్‌, ఎస్వీఆర్‌ గ్రానైట్స్‌లో ఐటీ, ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గ్రానైట్‌ వ్యాపారి అరవింద్‌వ్యాస్‌తో పాటు మరికొంతమంది ఇళ్లు, కార్యాలయాల్లోనూ తనిఖీలు జరుగుతున్నాయి. గ్రానైట్ వ్యాపారులు ఫెమా నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. గతంలోనే 8 ఏజెన్సీలకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈరోజు సుమారు 20 మంది అధికారులు బృందాలుగా విడిపోయి తనిఖీలు చేస్తున్నారు. గ్రానైట్‌ పరిశ్రమలకు చెందిన పత్రాలను పరిశీలిస్తున్నారు.

సాలార్‌పురియ సత్వ స్థిరాస్తి సంస్థకు చెందిన 316 బ్యాంకు ఖాతాలను సీజ్‌ చేశారు. సంస్థకు చెందిన 316 బ్యాంకు ఖాతాల్లోని రూ.49.99 కోట్లు సీజ్‌ చేశారు. దాడుల్లో 29 లక్షల నగదుతో పాటు విదేశీ కరెన్సీ సీజ్ చేసిన ఈడీ అధికారులు... మనీలాండరింగ్‌ చట్టం కింద డబ్బును స్వాధీనం చేసుకున్నారు.

ఖమ్మంలోనూ ఐటీ, ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నగరంలోని ప్రైవేటు ఆసుపత్రులపై ఆదాయపుపన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. ఉదయం 8 గంటల నుంచి ఆసుపత్రుల్లోని కంప్యూటర్లు, ఇతర ఫైల్స్ స్వాధీనం చేసుకుని సోదాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల కాలంలో భారీగా లావాదేవిలు నిర్వహించినట్లు సమాచారం అందుకున్న అధికారులు... దాడులకు దిగినట్లు తెలుస్తొంది. లావాదేవీలపై దర్యాప్తు చేస్తున్నారు. అయితే కొన్ని ఆస్పత్రుల్లో దాడులు జరుగుతుండగా... వెనుక నుంచి బస్తాల్లో దస్త్రాలు తరలించినట్లు స్థానికులు చెబుతున్నారు. సోదాలు జరుగుతుండగా ఆస్పత్రి వర్గాలు మీడియా అనుమతించకుండా తలుపులు మూసి వేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Nov 9, 2022, 3:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.