ETV Bharat / state

ఇక ప్రకటనల పరంపర.. రోస్టర్​, రిజర్వేషన్లు, జోనల్​పై స్పష్టత - ts news

ఉద్యోగ నియామక ప్రక్రియ వేగవంతం కానుంది. ముఖ్యమంత్రి ప్రకటనతో సంబంధిత కసరత్తును అధికార యంత్రాంగం ముమ్మరం చేయనుంది. పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు వెలువరించనుంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం భారీ సంఖ్యలో పోస్టులతో తొలి గ్రూప్ వన్ నోటిఫికేషన్ రానుంది.

ఇక ప్రకటనల పరంపర.. రోస్టర్​, రిజర్వేషన్లు, జోనల్​పై స్పష్టత

author img

By

Published : Mar 10, 2022, 4:33 AM IST

నిరుద్యోగ యువత ఎన్నాళ్లు గానో ఎదురు చూస్తున్న ఉద్యోగాల నియామకాలకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభ వేదికగా కీలక ప్రకటన చేశారు. 80,039 పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. సీఎం ప్రకటనతో తదుపరి ప్రక్రియ ప్రారంభం కానుంది. శాఖలు, జిల్లా, జోనల్, మల్టీ జోనల్ వారీగా కూడా పోస్టుల సంఖ్యను ప్రకటించారు. దీంతో ఉద్యోగాల భర్తీ కోసం ముందస్తు కసరత్తు పూర్తయింది. మరోమారు సంబంధిత శాఖలను సంప్రదించి, జిల్లాల వారీగా వివరాలను కచ్చితంగా నిర్ధారించుకొని ఉద్యోగాల భర్తీకి ఆర్థికశాఖ అనుమతిస్తుంది. ఖాళీలకు అనుగుణంగా నియామకాలు చేపట్టాల్సిందిగా నియామక సంస్థలకు అనుమతిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేస్తుంది. దాంతో తదుపరి ప్రక్రియను ఆయా నియామక సంస్థలు కొనసాగిస్తాయి.

రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా..

ఆర్థికశాఖ నుంచి అనుమతి లభించాక నియామక సంస్థలు ఖాళీలు ఉన్న శాఖల అధిపతులను సంప్రదిస్తాయి. స్థానికత ఆధారంగా ఖాళీల వివరాలతో పాటు రోస్టర్ పాయింట్ తదితర సమాచారాన్ని తీసుకుంటాయి. ఈ ప్రక్రియ ముగిశాక ఖాళీలకు అనుగుణంగా నియామక సంస్థలు ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ జారీ చేస్తాయి. రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా రాష్ట్రంలో కొత్త జోనల్ విధానం అమల్లోకి వచ్చింది. 33 జిల్లాలు, ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లుగా విభజించారు. దీంతో రాష్ట్రంలో జిల్లా, జోనల్, మల్టీ జోనల్ కేడర్ నియామకాలకు సంబంధించి కొత్త రోస్టర్ అమలు కానుంది. అన్ని రకాల రిజర్వేషన్లను పరిగణలోకి తీసుకొని కొత్త రోస్టర్ ప్రకారం నియామకాలు చేపడతారు. రాష్ట్ర స్థాయి పోస్టులకు సంబంధించి మాత్రం పాత రోస్టర్ కొనసాగనుంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం మొదటి సారి గ్రూప్ వన నోటిఫికేషన్ రానుంది.

ఫలించనున్న ఆశలు

గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్ 3, గ్రూప్ 4 నోటిఫికేషన్లు జారీ చేశారు. కానీ కీలకమైన గ్రూప్ వన్ నోటిఫికేషన్ మాత్రం ఇప్పటి వరకు రాలేదు. దీంతో గ్రూప్ వన్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న వారి ఆశలు త్వరలో ఫలించనున్నాయి. ఏకంగా 503 పోస్టులతో గ్రూప్ వన నోటిఫికేషన్ రానుంది. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో 569 పోస్టులతో గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ తర్వాత అంత ఎక్కువ సంఖ్యలో గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇప్పుడు రాబోతోంది. తాజా ఖాళీల్లో డిప్యూటీ కలెక్టర్ పోస్టులు 40 వరకు ఉన్నట్లు సమాచారం.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.