Transgenders Vikalp Program : ట్రాన్స్ జెండర్స్ ఈ పేరు వినపడినా....వారు కనిపించినా..కొందరికి ఏదొ తెలియని దురాలోనచన కలుగుతుంది. వారికి మనకు సంబంధం లేనట్లు వ్యవహరిస్తుంటారు. నిజానికి హైదరాబాద్ నగరంలో కొందరు ట్రాన్స్ జెండర్ల జీవితం ప్రస్తుతం అగమ్యగోచరంగా ఉంటోంది. అయితే వీరి కోసం పోలీసులు ఎన్జీవోలు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. దేశంలోనే తొలిసారిగా రాచకొండ కమిషనరేట్ పరిధిలో వికల్ప్ పేరుతో వారికి నైపుణ్య శిక్షణ, ఉపాధి, ఉద్యోగాలు కల్పించేందుకు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సెంటర్ ద్వారా వారికి కౌన్సింగ్ ఇచ్చి, వారి విద్యార్హతను బట్టి ఉద్యోగాలు వచ్చేలా చేయడమే ప్రధాన లక్ష్యం. ప్రజ్వల ఫౌండేషన్ కో ఫౌండర్ సునితా కృష్ణన్ సహకారంతో మీర్ పేట్ పోలీస్టేషన్ లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని డిజీపీ అంజనీ కుమార్ ప్రారంభించారు.
'' దేశంలోనే మొదటి సారిగా గొప్ప ఆలోచనతో వికల్ప్ పేరుతో ఉద్యోగాలు కల్పించేందుకు కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. తగిన నైపుణ్యాలు ఉంటే ఉద్యోగాలు ఇప్పిస్తాం. విద్యార్హతను బట్టి ఉద్యోగాలు వచ్చేలా చేస్తాం. సమాజంలో కొందరు చేయబట్టి వీరికి చెడ్డ పేరు వస్తోంది. ఇప్పుడు సమాజం గర్వపడేలా, అందరితో సమానంగా ఉద్యోగాలు చేయాలి.'' - అంజనీ కుమార్, రాష్ట్ర డీజీపీ
ఈ వికల్ప్ సెంటర్ లో ట్రాన్స్ జెండర్స్ ఎవరైనా వచ్చి తమ సమస్యలు చెప్పుకోవచ్చు కౌన్సలింగ్ను పొందొచ్చని పోలీసులు తెలిపారు. ఈ సెంటర్ లో డిపార్ట్‌మెంట్ కు చెందిన రిసెప్షనిస్ట్ గా మహిళా కానిస్టేబుల్, కౌన్సిలింగ్ ఇచ్చేందుకు ఒక పోలీసు కానిస్టేబుల్ తో పాటు ప్రజ్వల ఫౌండేషన్ నుంచి ఒక ప్రతినిధి ఉంటారు. ఇక్కడ ఆ ప్రతినిధి కూడా ట్రాన్స్‌జెండర్ కావడం విశేషం. ప్రస్తుతం ఇక్కడ కౌన్సిలర్ గా గాయత్రి అనే ట్రాన్స్‌జెండర్ నియమితులయ్యారు. సమాజంలో ప్రస్తుతం ట్రాన్స్ జెండర్స్ మాఫియా జరుగుతుందని, వారి హక్కులు వారికి తెలియజేసి నూతన జీవితాన్ని ప్రారంభించేలా తాము పనిచేస్తామని ఆమె చెబుతున్నారు.
పోలీసులు, ప్రజ్వల్ ఫౌండేషన్ కలిసి తీసుకొచ్చిన ఈ ఆలోచన మా భవిష్యత్తుకు తొలిమెట్టు అని ట్రాన్స్ జెండర్లు చెబుతున్నారు. భిక్షాటన, పడుపు వృత్తికి ట్రాన్స్ జెండర్స్ కాదని నిరూపిస్తామంటున్నారు. తమ కాళ్లమీద తాము నిలబడేలా ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగ పడుతుందని అంటున్నారు. పోలీసులు ముందుకు వచ్చి మాకు భవిష్యత్తు ఇస్తామంటే మాకు చాల ఆనందంగా ఉందన చెబుతున్నారు.
'' సమాజంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాం. మరెన్నో కష్టాలు పడ్డాం. ఎలాంటి అవకాశాలు లేక భిక్షాటన చేశాం. మా కోసం పోలీసు కౌన్సిలింగ్ ఇచ్చి ఉద్యోగాలు కల్పించడం చాలా ఆనందంగా ఉంది. మా కాళ్ల మీద మేం నిలబడేందుకు స్వయం ఉపాధి, ఉద్యోగాలు చేస్తాం. -ట్రాన్స్ జెండర్స్
రాచకొండ పోలీసులు, ప్రజ్వల ఫౌండేషన్ కలిసి ప్రారంభించిన కార్యక్రమానికి తోడు , వారికి ఉద్యోగాలు కల్పంచేందుకు 15 ప్రైవేటు కంపనీలు ముందుకు వచ్చాయి. విద్యార్హతను, నైపుణ్యాన్ని బట్టి వారికి ఉద్యోగాలు కల్పించడానికి సిద్దంగా ఉన్నాయి. విద్యార్హత లేని వారికి స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం నుంచి ఎలాంటి అవకాశాలు ఉన్నాయో కూడా తెలయజేయనున్నారు. ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంలో ఎల్బీనగర్ డిసిపి సాయిశ్రీ ఎంతో కృషి చేశారు. ప్రజ్వల ఫౌండేషన్ తో కలిసి వారికి మంచి భవిష్యత్ ఇచ్చేందుకు పాటుపడతామన్నారు.
ఇవీ చదవండి