రాష్ట్రంలో గ్రూప్-1 నోటిఫికేషన్‌కు దరఖాస్తులు పెరుగుతున్నాయి. శుక్రవారానికి కమిషన్‌కు అందిన దరఖాస్తుల సంఖ్య 93,813కు చేరుకుంది. ఇవి రోజుకు 10 వేల వరకు వస్తుండటంతో శనివారం నాటికి ఈ సంఖ్య లక్ష దాటనున్నట్లు కమిషన్ వర్గాలు భావిస్తున్నాయి. తొలిరోజు 3,895 దరఖాస్తులు వస్తే.. పది రోజుల వ్యవధిలో ఆ సంఖ్య లక్షకు చేరువైంది. చివరి తేదీ నాటికి గ్రూప్-1 నోటిఫికేషన్‌కు భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తాయని కమిషన్ అంచనా వేస్తోంది.
ఉద్యోగార్థులు ముందుగానే దరఖాస్తు చేసుకుంటే పరీక్ష కేంద్రాల కేటాయింపులో ఎలాంటి ఇబ్బందులు ఉండవని భావిస్తున్నారు. దరఖాస్తులు ఎక్కువగా ఉంటే.. తొలి ఆప్షన్‌లోని కేంద్రాలు నిండిపోయి రెండో ఆప్షన్‌కు వెళ్లాల్సి వస్తుందని.. దూరంగా కేంద్రాలు ఉంటే ప్రయాణ ఇక్కట్లు ఎదురవుతాయని ముందస్తు జాగ్రత్త పడుతున్నారు. రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల ప్రకారం వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ల(ఓటీఆర్)లో కొత్త రిజిస్ట్రేషన్లు ఎక్కువగా ఉన్నాయి. గతంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న 25 లక్షల మంది అభ్యర్థుల్లో కేవలం 2.2 లక్షల మందే ఇప్పటి వరకు ఎడిట్ చేసుకున్నారు. కొత్త రిజిస్ట్రేషన్లు 1.04 లక్షలకు చేరుకున్నాయి.
ఇవీ చదవండి..:
గ్రూప్-1కు స్టడీ మెటీరియల్ కష్టాలు.. ఏ పుస్తకాలు చదవాలి?
TSPSC OTR: ఓటీఆర్‌లో సవరణలకు ఛాన్స్.. నేటి నుంచే అందుబాటులోకి..