ETV Bharat / state

ఇంజినీరింగ్‌ విద్యార్థులకు వేసవి సెలవుల రద్దు: జేఎన్‌టీయూ - తెలంగాణ వార్తలు

ఇంజినీరింగ్‌ విద్యార్థులకు వేసవి సెలవుల రద్దు చేస్తున్నట్లు.. ల్యాబ్‌/ప్రాక్టికల్స్‌ నిర్వహణకు కేటాయిస్తున్నట్లు జేఎన్‌టీయూ రిజిస్ట్రార్‌ పేర్కొన్నారు. ఈ సమయంలోనూ ఆన్‌లైన్‌ తరగతులు కొనసాగించాలని అనుబంధ, గుర్తింపు పొందిన కళాశాలలకు ఆదేశాలు జారీ చేశారు.

జేఎన్‌టీయూ,  ఇంజినీరింగ్‌, బీఫార్మసీ
jntu, engineering students, telangana news
author img

By

Published : May 20, 2021, 8:30 AM IST

రాష్ట్రంలో ఇంజినీరింగ్‌, బీఫార్మసీ రెండు, మూడో ఏడాది రెండో సెమిస్టర్‌ కాల పట్టికను జేఎన్‌టీయూ సవరించింది. ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మా-డి(రెగ్యులర్‌), ఫార్మా-డి(పీబీ) రెండో సెమిస్టర్‌లోనూ మార్పులు చేసింది. ఆన్‌లైన్‌ తరగతుల షెడ్యూల్‌, పరీక్షల తేదీలను నిర్ణయించింది. ఆ వివరాలను జేఎన్‌టీయూ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎం.మంజూర్‌ హుస్సేన్‌ విడుదల చేశారు. గతంలో ఇచ్చిన షెడ్యూల్‌ ప్రకారం.. ఈ నెల 17 - 29 మధ్య వేసవి సెలవులు ఉంటాయని వర్సిటీ ప్రకటించగా... ప్రస్తుతం వాటిని రద్దు చేస్తున్నట్లు, ల్యాబ్‌/ప్రాక్టికల్స్‌ నిర్వహణకు కేటాయిస్తున్నట్లు రిజిస్ట్రార్‌ పేర్కొన్నారు. ఈ సమయంలోనూ ఆన్‌లైన్‌ తరగతులు కొనసాగించాలని అనుబంధ, గుర్తింపు పొందిన కళాశాలలకు ఆదేశాలు జారీ చేశారు.

కొత్త షెడ్యూల్‌ ప్రకారం బీటెక్‌, బీఫార్మసీ రెండు, మూడు సంవత్సరాల రెండో సెమిస్టర్‌ విద్యార్థులకు మే 31-జూన్‌ 5 మధ్య ఆన్‌లైన్‌లో మిడ్‌టర్మ్‌ పరీక్షలు జరుగుతాయి. అనంతరం జూన్‌ 7 - జులై 17 మధ్య రెండోదశ ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తారు. జులై 19 - 24 వరకు రెండో మిడ్‌ టర్మ్‌ పరీక్షలు ఉంటాయి. జులై 26 - ఆగస్టు 14 మధ్య ప్రాక్టికల్స్‌ ఉంటాయి. అదే నెల 16 - 28 మధ్య సెమిస్టర్‌ పరీక్షలు జరుగుతాయి.

ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మా- డి 2, 3, 4, 5 సంవత్సరాల విద్యార్థులకు జులై 19- 31 మధ్య సెమిస్టర్‌ పరీక్షలు నిర్వహిస్తారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.