మలేషియన్ టౌన్‌షిప్ రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి జేఎన్టీయూ వరకు నిర్మించిన ఫ్లైఓవర్ ప్రారంభమైంది. ఈ నిర్మాణం పూర్తై దాదాపు వారం రోజులు కావస్తోంది. ఇంకా ప్రారంభించకపోవడంతో ప్రయాణికులు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను సామాజిక మాద్యమాల ద్వారా జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేశారు. స్పందించిన అధికారులు ఇవాళ ఫ్లైఓవర్‌ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. నిజాంపేట్, ప్రగతి నగర్, కూకట్‌పల్లి నుంచి హైటెక్ సిటీకి ఇరువైపులా రోజుకు దాదాపు లక్షా అరవై వేల వాహనాలు ప్రయాణిస్తున్నాయి.
66 శాతం ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గుతాయి
ఎస్ఆర్డీపీ నాలుగో ప్యాకేజీలో భాగంగా 97.94 కోట్ల రూపాయలతో 1230 మీటర్ల పొడవున ఈ ఫ్లైఓవర్‌ను నిర్మించారు. 20 మీటర్ల వెడల్పు ఇరువైపులా ఆరు లైన్లు ఉన్న ఈ ఫ్లైఓవర్ మార్గంలో రద్దీ వేళలో 12 వేల వాహనాలు ఒకేసారి ప్రయాణిస్తాయని అధికారులు అంచనా వేశారు. 2035 సంవత్సరం నాటికి ఈ వాహనాల సంఖ్య 26 వేల వాహనాలకు చేరుతాయని అంచనా. ఈ ఫ్లైఓవర్‌తో రద్దీ సమయాల్లో 66 శాతం ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గుతాయని భావిస్తున్నారు.
ఫ్లైఓవర్ ప్రారంభం పట్ల నగరవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు చాలావరకు తగ్గాయని పేర్కొన్నారు.
ఇవీ చదవండి: ఐదేళ్లలో చాయ్‌వాలా బన్‌గయా చౌకీదార్...!