ETV Bharat / state

జలవివాదాలపై ఈ నెల 24న చర్చ - water dispute

ఈనెల 24 న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శలు, నీటి పారుదలశాఖ ముఖ్యకార్యదర్శులతో హైదరాబాద్‌లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వివిధ అంశాలపై చర్చించిన తర్వాత రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మరో సమావేశం జరిగే అవకాశం ఉంది.

telangana and ap water dispute
జలవివాదాలపై ఈ నెల 24న చర్చ
author img

By

Published : Jun 17, 2019, 8:46 AM IST

Updated : Nov 9, 2022, 1:46 PM IST

తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు, ఇతర అంశాలను పరిష్కరించుకునేందుకు రెండు ప్రభుత్వాలు శ్రీకారం చుట్టాయి. నీటి వివాదాలపై చర్చించుకునేందుకు గవర్నర్ నరసింహన్​ ఈనెల 24 న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు, నీటి పారుదలశాఖ ముఖ్యకార్యదర్శలతో హైదరాబాదులో సమావేశం ఏర్పాటు చేశారు. వివిధ అంశాలపై చర్చించిన తర్వాత 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మరో సమావేశం జరిగే అవకాశం ఉంది. రంజాన్ సందర్భంగా గవర్నర్ నరసింహన్ ఇచ్చిన విందులో రెండు రాష్ట్రాల సీఎంలు పాల్గొని చర్చించిన అనంతరం హైదరాబాద్​లోని ఏపీ ఆధీనంలో ఉన్న భవనాలను తెలంగాణకు అప్పగించారు. దీనికి ప్రతిగా హైదరాబాద్​లో రెండు భవనాలు ఏపీకి ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది.

ఈ నెల 19కల్లా ఆంధ్రప్రదేశ్ తమ ఆధీనంలో ఉన్న భవనాలు ఖాళీ చేయనుంది. తర్వాత నీటి వివాదాలపై రెండు రాష్ట్రాలు దృష్టి సారించాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఎస్.కె జోషి, ఎల్.వీ సుబ్రమణ్యంతో చర్చించారు. అనంతరం ఈ నెల 24న భేటీకి అంగీకరించారు. కృష్ణాజలాలకు సంబంధించిన అంశంపై బ్రిజేష్​కుమార్ ట్రైబ్యునల్ ఎదుట రెండు రాష్ట్రాల వాదనలు వినిపిస్తున్నాయి. కృష్ణాజలాలపై రెండు రాష్ట్రాలు అంగీకారానికి వచ్చి పరిష్కరించుకోవాలన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది. పట్టిసీమ ద్వారా గోదావరి నుంచి కృష్ణాలోకి మళ్లించే 80 టీఎంసీలలో 45 టీఎంసీలు తమకు కేటాయించాలని తెలంగాణ కోరుతుండగా, ఆంధ్రప్రదేశ్ దీనికి అంగీకరించలేదు. గోదావరి నుంచి కృష్ణాలోకి తెలంగాణ 240 టీఎంసీలు మళ్లిస్తుందని, ఇందులో తమకు వాటా ఇవ్వాలని ఏపీ కోరుతుంది. గోదావరి నుంచి మళ్లించే నీటిపై రెండు రాష్ట్రాలు కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖకు, కృష్ణా,గోదావరి బోర్డులకు రెండు రాష్ట్రాలు పలుమార్లు ఫిర్యాదులు చేసుకున్నాయి. గోదావరి జలాల వినియోగంపై రెండు రాష్ట్రాలు ఓ అంగీకారానికి రావాల్సి ఉంది. మళ్లీ ఖరీప్ సీజన్ ప్రారంభమైనందున శ్రీశైలం, నాగర్జునసాగర్ నిర్వహణకు సంబంధించిన అంశాలపై చర్చించే అవకాశం ఉంది.

Last Updated : Nov 9, 2022, 1:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.