ఎన్‌ఎంసీ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జూనియర్ డాక్టర్స్ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద జూడాలు చేస్తున్న వైద్య మహా గర్జనకు సినీ నటుడు జీవితారాజశేఖర్ కుటుంబం మద్దతు తెలిపింది. జీవితారాజశేఖర్‌తో పాటు వారి ఇద్దరు కూతుళ్లు కూడా ధర్నాకు సంఘీభావం ప్రకటించారు. ఎన్‌ఎంసీ బిల్లు వల్ల ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని... బ్రిడ్జ్ కోర్సును వెంటనే ఉపసంహరించుకోవాలని రాజశేఖర్ అన్నారు. సమస్య పరిష్కారమయ్యేంత వరకు జూడాల సమ్మెకు మా కుటుంబం మద్దతు ఉంటుందంటున్న రాజశేఖర్, శివానీలతో ఈటీవీ భారత్ ముఖాముఖి.
ఇవీ చూడండి: నేడు తీవ్రరూపం దాల్చనున్న జూడాల ఆందోళన