ఈటల రాజేందర్‌కు నియోజకవర్గ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని హుజూరాబాద్ ఉప ఎన్నికల భాజపా ఇంఛార్జీ, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ ఉప ఎన్నికపై ముఖ్యమంత్రి కేసీఆరే స్వయంగా మానిటరింగ్ చేయటమే తెరాస ఓడిపోతుందనడానికి నిదర్శనమన్నారు. ఓటమి భయంతోనే సీఎం కేసీఆర్ దళితబంధు పథకం తీసుకొచ్చారని ఆరోపించారు.
ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో ఈటల రాజేందర్‌పై అసత్యాలు ప్రచారాలు చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు జితేందర్‌రెడ్డి తెలిపారు. ముఖ్య నేతలతో సమావేశం కారణంగా ఈటల రాజేందర్ ప్రజా దీవెన పాదయాత్రకు రేపు ఒక్క రోజు విరామం ఇస్తునట్లు చెప్పారు. ఎల్లుండి నుంచి పాదయాత్ర మరింత ఉద్ధృతంగా కొనసాగుతోందని స్పష్టం చేశారు.
హుజూరాబాద్ బై ఎలక్షన్లో ఈటల రాజేందర్‌కు ప్రజలంతా బ్రహ్మరథం పడుతున్నారు. ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ఇది నీ ఒక్కడి ఆత్మగౌరవ పోరాటం కాదు.. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలందరిది అంటూ మద్దతిస్తున్నారు. ఈరోజు కేసీఆర్ భయపడి ఫామ్‌హౌస్‌ను వదిలి.. ప్రగతిభవన్‌లో కూర్చుని రకరకాల కుట్రలు చేస్తున్నారు. ఈటల రాజేందర్‌పై సామాజిక మాధ్యమాల్లో అసత్యాలు ప్రచారాలు చేస్తున్నారు. ముఖ్య నేతల సమావేశం కారణంగా ఈటల రాజేందర్ రేపు ఒక్కరోజు పాదయాత్రకు విరామం తీసుకుంటున్నారు. ఎల్లుండి నుంచి తిరిగి పోరు కొనసాగుతుంది.-జితేందర్‌రెడ్డి, హుజూరాబాద్ ఉప ఎన్నికల భాజపా ఇంఛార్జీ
ఇదీ చూడండి: Huzurabad By elections: హుజూరాబాద్ బరిలో 800 ఎంపీటీసీలు