కరోనా కారణంగా పరీక్షా కేంద్రాల వద్ద ప్రతి ఒక్క అభ్యర్థికీ థర్మల్ స్క్రీనింగ్ చేస్తారు. మొదటిసారి ఉష్ణోగ్రత 99.4 డిగ్రీలు దాటితే వారిని కొద్దిసేపు పక్కన ఉంచి... మళ్లీ ఉష్ణోగ్రత చూస్తారు. అప్పటికీ వారి పరిస్థితి అదేవిధంగా ఉంటే ఐసొలేషన్ గదిలో పరీక్ష రాయిస్తారు. ఈ నేపథ్యంలో ప్రతి పరీక్షా కేంద్రంలోనూ ఒక ఐసొలేషన్ గదిని ఏర్పాటు చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా సెప్టెంబరు 1 నుంచి 6 వరకు జరగనున్న జేఈఈ మెయిన్ నిర్వహణకు కొవిడ్ నేపథ్యంలో ఈసారి పలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించిన వెంటనే సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవాలి. అభ్యర్థుల వద్ద ఏమైనా నకలు కాపీలు ఉన్నాయా? అనుమతి లేని వస్తువులను తీసుకొస్తున్నారా? అని తనిఖీ చేసేందుకు ఈసారి మెటల్ డిటెక్టర్లను వినియోగిస్తారు. దేశవ్యాప్తంగా 224, ఇతర దేశాల్లోని మరో 8 నగరాల్లో పరీక్ష జరగనుంది.
ఇదీ చదవండి- రికార్డు స్థాయిలో కరోనా టెస్టులు- రోజుకు 10 లక్షల దిశగా