జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్ష ప్రాథమిక సమాధానాలు, రెస్పాన్స్ షీట్లను జాతీయ పరీక్షల సంస్థ విడుదల చేసింది. అభ్యంతరాలు ఉంటే రేపు సాయంత్రం 6 గంటల వరకు https://jeemain.nta.nic.in ద్వారా సవాల్ చేయవచ్చునని ఎన్టీఏ తెలిపింది. ఈనెల 5 లేదా 6న ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది.
ఈనెల 23 నుంచి 26 వరకు మొదటి విడత జేఈఈ మెయిన్ పరీక్షలు జరిగాయి. మొదటి విడతలో గరిష్ఠంగా 295 మార్కులు స్కోర్ ఉండొచ్చునని నిపుణుల అంచనా. ఈనెల 15 నుంచి 18 వరకు జరగనున్న రెండో విడత జేఈఈ మెయిన్ పరీక్షలకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. నేటి నుంచి ఈనెల 6వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తు స్వీకరణ చేయనున్నట్లు ఎన్టీఏ వెల్లడించింది. గతంలో దరఖాస్తు చేసిన వారు ఉపసంహరించుకోవడానికి, మార్పులు చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించింది.
ఇదీ చూడండి: ఆకతాయిలకు బుద్ధి చెప్పే 'స్వయం సిద్ధ'