హైదరాబాద్‌లోని ఆర్థిక సేవలకు సంబంధించిన సాంకేతికత కంపెనీలకు వేదికగా హెచ్ఎఫ్ఎఫ్ను నేడు తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ ప్రారంభించారు. ఆర్థిక సాంకేతికతకు సంబంధించిన ఆలోచనలు, వివిధ ఆంశాలపై చర్చించడానికి ఇది ఒక వేదికగా నిలవనుంది. సంవత్సరానికి ఒక పెద్ద సంస్థను తయారు చేయాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ ఫోరమ్‌లో కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్ తదితర రంగాలలో 7 స్పెషల్ గ్రూపులను ఏర్పాటు చేసినట్లు జయేశ్ రంజన్ పేర్కొన్నారు.
అంకురాలకు మెంటార్ షిప్..!
600లకు పైగా సభ్యులతో మొదలైన ఈ ఫోరమ్ లో అంకురాలు, బహుళజాతి సంస్థలు, ప్రభుత్వాధికారులు, విద్యావేత్తలు, పరిశోధకులు ఉన్నారు. ఆర్థిక సాంకేతికత సంబంధించిన ఆలోచనలతో పాటు ఆ రంగానికి సంబంధించిన వివిధ ఆంశాలపై చర్చించటానికి ఇది ఒక వేదికగా ఉండనుంది. అంకురాలకు మెంటార్ షిప్ ను కూడా హెచ్ఎఫ్ ఎఫ్ అందించనుంది. దీనికోసం గ్లోబల్ ఫిన్ టెక్ మెంటార్ గ్రిడ్ ను ఏర్పాటు చేయనుంది. టీ-హబ్ కూడా ఈ ఫోరమ్ లో సభ్యత్వం కలిగి ఉంది.
హాంకాంగ్ ఇంక్యూబేటర్‌తో ఒప్పందం
కార్యక్రమంలో హైదరాబాద్‌లోని అంకుర ఇంక్యూబేటర్ అయిన క్యూ-హబ్‌తో డబ్ల్యూహబ్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా ఇరు దేశాల్లో ఫిన్ టెక్ మార్కెట్‌పై పరస్పర అవగాహన కలుగుతుంది