పరిశోధకులకు, జౌత్సాహికులకు, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ(ఐపీ) అభివృద్ధి చేసే వారిని రాష్ట్రం అక్కున చేర్చుకుంటుందని పరిశ్రమలు, ఐటీ ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్ అన్నారు. అందుకనే ఇంతకుముందు లేనటువంటి విధంగా రాష్ట్ర ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అవార్డులను ప్రవేశపెట్టామని తెలిపారు. నేటి వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డే సందర్భంగా భారత పరిశ్రమల సమాఖ్య తెలంగాణ శాఖ... 'సుస్థిరమైన ప్రపంచంలో ఇంటలెక్చువల్ ప్రాపర్టీల పాత్ర' అనే అంశంపై వర్చువల్ గా నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతున్నందున ఐపీ ఆవార్డులకు విజేతలను నిర్ణయించలేదని, పరిశ్రమలు ఈ అవకాశాన్ని విడిచిపెట్టకుండా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ఐపీఆర్‌లను ప్రోత్సహించేందుకు భారత పరిశ్రమల సమాఖ్య, ఇతరులతో కలిసి టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనను కార్యక్రమానికి హాజరైన వివిధ పరిశ్రమల ప్రతినిధులు ఆయన ముందుంచారు.
ఇవీ చూడండి: మే7 దాకా ఇంతే.. కేసులు తగ్గటం శుభపరిణామం : కేసీఆర్