జనవరి 31న జరిగిన జయరామ్ హత్య కేసులో నిందితుడు రాకేశ్‌రెడ్డిని నందిగామ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. హత్య హైదరాబాద్‌లో జరగడంతో కేసును జూబ్లీహిల్స్‌కు బదిలీ చేశారు. తన భర్త హత్యపై హైదరాబాద్ పోలీసులే విచారణ జరపాలని పద్మశ్రీ కోరిన నేపథ్యంలో ఈ కేసును హైదరాబాద్ పోలీసులు దర్యాప్తు చేయనున్నారు.