సంచలనం సృష్టించిన పారిశ్రామిక వేత్త, కోస్టల్‌బ్యాంక్ డైరెక్టర్ చిగురుపాటి జయరాం హత్య కేసులో దర్యాప్తు వేగంగా సాగుతోంది. కేసులో నిందితుడిగా ఉన్న రాకేశ్రెడ్డి, జయరాం మేనకోడలు శిఖాచౌదరిని పోలీసులు కృష్ణా జిల్లా నందిగామకు తీసుకెళ్లారు. ఇద్దరిని నందిగామ పోలీస్‌స్టేషన్‌లోనే విచారిస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకూ సుమారు వంద మంది అనుమానితులను విచారించారు. మరోవైపు ఈ హత్య కేసుతో తన కుమారుడికి సంబంధం లేదని.. శిఖా చౌదరి ప్రమేయం ఉందని రాకేశ్రెడ్డి తండ్రి ఆరోపించారు. ఈ సాయంత్రానికి నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి.
జయరాం హత్య కేసులో రహస్య విచారణ - ap
నందిగామ కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్ హత్య కేసులో కొత్త మలుపు. జయరాం మేనకోడలు శిఖా చౌదరి హస్తముందంటూ రాకేశ్ తండ్రి ఆరోపణ.
సంచలనం సృష్టించిన పారిశ్రామిక వేత్త, కోస్టల్‌బ్యాంక్ డైరెక్టర్ చిగురుపాటి జయరాం హత్య కేసులో దర్యాప్తు వేగంగా సాగుతోంది. కేసులో నిందితుడిగా ఉన్న రాకేశ్రెడ్డి, జయరాం మేనకోడలు శిఖాచౌదరిని పోలీసులు కృష్ణా జిల్లా నందిగామకు తీసుకెళ్లారు. ఇద్దరిని నందిగామ పోలీస్‌స్టేషన్‌లోనే విచారిస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకూ సుమారు వంద మంది అనుమానితులను విచారించారు. మరోవైపు ఈ హత్య కేసుతో తన కుమారుడికి సంబంధం లేదని.. శిఖా చౌదరి ప్రమేయం ఉందని రాకేశ్రెడ్డి తండ్రి ఆరోపించారు. ఈ సాయంత్రానికి నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి.
Body:మధు
Conclusion:సికింద్రాబాద్