ETV Bharat / state

నగరంలో హైదరాబాద్‌-జపాన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్ - హైదరాబాద్​

నగరంలో వచ్చే ఏడాది నుంచి అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలను నిర్వహించేందుకు కృషి చేస్తామని ఐటీ శాఖ కార్యదర్శి జయేష్‌ రంజన్‌ అన్నారు. అమీర్​పేటలో హైదరాబాద్​-జపాన్​ ఫిల్మ్​ ఫెస్టివల్​-2019 ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

నగరంలో హైదరాబాద్‌-జపాన్‌ ఫీల్మ్‌ ఫెస్టివల్
author img

By

Published : Sep 6, 2019, 6:36 AM IST

Updated : Sep 6, 2019, 8:15 AM IST

నగరంలో హైదరాబాద్‌-జపాన్‌ ఫీల్మ్‌ ఫెస్టివల్

హైదరాబాద్​ అమీర్‌పేటలోని సారథి స్టూడియోలో హైదరాబాద్‌-జపాన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌-2019 ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐటీ శాఖ కార్యదర్శి జయేష్‌ రంజన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భాగ్యనగరంలో గత 20 ఏళ్లుగా అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బహుభాషా చిత్రాలను ప్రదర్శించడం ద్వారా ఆయా దేశాల సంస్కృతులు, సంప్రదాయాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని జయేష్‌ రంజన్‌ తెలిపారు.

హైదరాబాద్‌ ఫిల్మ్‌ క్లబ్‌ స్థాపించి 45 ఏళ్లు పూర్తి చేసుకుంటుందని, ఆయా దేశాలకు చెందిన ఉత్తమ చిత్రాలను నగర వాసులకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ చిత్రోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఫిల్మ్‌ క్లబ్‌ వైస్‌ ఛైర్మన్‌ శ్యామ్‌ గోపాల్‌ కౌసిరీ పేర్కొన్నారు. ఇలాంటి చిత్రాలు ప్రేక్షకులకు ఎక్కడ దొరకవని అన్నారు. హైదరాబాద్‌ ఫిల్మ్‌క్లబ్‌, శ్రీ సారథి స్టూడియో, కాన్సులేట్‌-జనరల్‌ ఆఫ్‌ జపాన్‌ ఇన్‌ చెన్నై ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నిర్మాత కళ్యాణ్‌, చలనచిత్ర అభిమానులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి : రైతు మృతిపై మంత్రి వ్యాఖ్యలు బాధాకరం: ఉత్తమ్

Intro:కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులను అధికారులు నాయకులు సన్మానించారు. ఉపాధ్యాయులే మార్గదర్శకులు అని కొనియాడారు.

సమాజానికి మార్గదర్శకులు ఉపాధ్యాయులే నని అధికారులు నాయకులు పేర్కొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో కొమురం భీం భవనంలో పాటు చేసిన ఉత్తమ పురస్కారాల కార్యక్రమానికి జిల్లా జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, ఆసిఫాబాద్ శాసనసభ్యులు ఆత్రం సక్కు, ఎమ్మెల్సీ పురాణం సతీష్ ,జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఉపాధ్యాయ వృత్తి ఎంత గౌరవప్రదమైన దని, విద్యార్థులు తల్లిదండ్రుల తరువాత గురువులని దైవంగా భావిస్తారు అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థులను తీర్చి దిద్ది భావితరాలకు అందించాలని పేర్కొన్నారు. జిల్లాలో విద్యాభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. ఎంత ఉన్నత చదువులు పొందినప్పటికీ గురువుల పుణ్యమే అని కొనియాడారు. ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని తెలిపారు. దేశానికి ఎంతో మందిని ఉత్తములుగా తీర్చిదిద్దిన ఘనత ఉపాధ్యాయుల దే ముఖ్య పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలని చెప్పారు. ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల బలోపేతంపై దృష్టి సారించాలని తెలిపారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు హామీ ఇచ్చారు. ప్రభుత్వం ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య ప్రమాణాలను అందించేందుకు కృషిచేయాలని తెలిపారు. జిల్లా విద్యాశాఖ అధికారి బొల్లారం బిక్షపతి ఆయా మండలాలకు చెందిన ఎంఈవోలు ,పీజీ హెచ్ఎంలు, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులకు, ఎంపికైన ఉపాధ్యాయులకు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు.
జి. వెంకటేశ్వర్లు
9849833562
8498889495
ఆసిఫాబాద్
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా

Body:tg_adb_25_05_upadyaya_dhinoshavam_avb_ts10078

Conclusion:
Last Updated : Sep 6, 2019, 8:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.