పాఠశాలల్లో విద్యార్థుల నమోదు ఘనంగా ఉన్నా.. చదువుల్లో నాణ్యత ఆందోళనకరంగా ఉందన్నారు విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి. తరగతి చదువులకు తగ్గట్లు లేని విద్యాప్రమాణాలను సమీక్షించి.. చదువులు నాణ్యత పెంచేందుకు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో నిర్వహించిన డిస్టింగ్విష్డ్ లెక్చర్ సిరీస్‌ను ఇవాళ హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా అమెరికాకు చెందిన ఎమోరీ యూనివర్శిటీ ప్రొఫెసర్ జగదీష్ సేథ్ హాజరైయ్యారు. రాష్ట్ర ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి, ఐటీకార్యదర్శి జయేష్ రంజన్ వంటి ప్రముఖులు సెమినార్‌లో పాల్గొన్నారు. కొత్త, చిన్న రాష్ట్రంగా తెలంగాణకు అనేక అవకాశాలున్నాయని ప్రొఫెసర్ సేథ్ తెలిపారు. తమ దగ్గరున్న వనరులతో ఫార్మాహబ్, మెడికల్ డివైస్ పార్క్, జీనోమ్ వ్యాలీ, టెక్స్‌టైల్ పార్క్ వంటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామని ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ పేర్కొన్నారు.
ఇవీ చూడండి: దరువేసిన చిన్నోడు... ఫిదా అయిన పద్మారావ్ గౌడ్