My Journey towards the Ultimate Reality: విశ్వంతో పోలిస్తే భూగోళం పరిధి తక్కువని.. మానవ శరీరంలోనే సమగ్ర ప్రయోగ శాల ఉందని విశ్రాంత సివిల్ ఇంజినీర్, రచయిత జంగా హనుమంతరావు అన్నారు. ఆయన రాసిన "మై జర్నీ టువార్డ్స్ ది అల్టిమేట్ రియాలిటీ" అనే పుస్తకాన్ని.. హైదరాబాద్ ఎల్బీనగర్లోని చిత్రా లే అవుట్ కాలనీలో ఆవిష్కరించారు. ఈ పుస్తకం రాయడానికి రెండేళ్లు పట్టిందన్న ఆయన.. తన పదేళ్ల అనుభవాల ద్వారా రచించినట్లు చెప్పారు.
మానవ శరీరం సాధారణ భౌతిక అంశాలతో నిర్మితం కాలేదని జంగా హనుమంతరావు అన్నారు. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో యోగాసనం, ధ్యానం వైపునకు సామాన్య పౌరులను మొగ్గు చూపారని.. శరీరాన్ని విశ్వంతో అనుసంధానిస్తూ అనేక విషయాల్ని అన్వేషించారని తెలిపారు. మానవ శరీరం ద్వారా ప్రపంచ గొలుసు, విశ్వంలోని స్పృహ, ఆత్మ, హృదయ స్పందన గురించి తెలుస్తాయని వివరించారు.
"కేవలం భౌతిక అంశాలతో శరీరం నిర్మాణం కాలేదు. విశ్వంతో శరీరం ముడిపడి ఉంది. అదే విషయాన్ని ఈ పుస్తకం ద్వారా చెప్పదలుచుకున్నాను. ఎన్నో రకాల శక్తులు మానవ శరీరంలో ఇమిడి ఉన్నాయి. విశ్వంతో పోలస్తే భూగోళం పరిధి తక్కువ. మానవ శరీరంలోనే సమగ్ర ప్రయోగ శాల ఉంది." -జంగా హనుమంతరావు, పుస్తక రచయిత
విశ్వాంతరాళం గురించి తెలియజేసే ప్రయత్నంలో ఆంగ్ల భాషలో మొదటి ప్రతులను విడుదల చేసినట్లు హనుమంతరావు చెప్పారు. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా అందరూ చదవాలని ఆకాంక్షించారు. పుస్తకానికి రెండో భాగం మరికొంత సమయం పట్టొచ్చని వెల్లడించారు. కార్యక్రమంలో చిత్ర లేఔట్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ముస్కు అంజిరెడ్డితో పాటు కమ్యూనిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: kishan reddy: వచ్చే ఎన్నికల్లో ఓటమి నుంచి కేసీఆర్‌ను ఎవరూ కాపాడలేరు: కిషన్‌రెడ్డి