ETV Bharat / state

యువతను నట్టేట ముంచిన వైకాపాను ఇక సాగనంపాలి: పవన్​

Pawan Kalyan Latest Comments: ఏపీలోని జగనన్న కాలనీలపై జనసేన పార్టీ చేపట్టిన సోషల్‌ ఆడిట్‌లో పాల్గొనేందుకు ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌.. విజయనగరం గుంకలాంలో పర్యటిస్తున్నారు. జగనన్న కాలనీల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న జనసేన.. క్షేత్రస్థాయిలో పర్యటించి వాటిని వెలికితీస్తామని ప్రకటించింది. అందులో భాగంగా పవన్‌కల్యాణ్‌.. గుంకలాంలోని జగనన్న కాలనీని పరిశీలించిన పవన్ గుంకలాం ప్రజలతో ముఖాముఖీ నిర్వహించారు.

యువతను నట్టేట ముంచిన వైకాపాను ఇక సాగనంపాలి: పవన్​
యువతను నట్టేట ముంచిన వైకాపాను ఇక సాగనంపాలి: పవన్​
author img

By

Published : Nov 13, 2022, 4:29 PM IST

యువతను నట్టేట ముంచిన వైకాపాను ఇక సాగనంపాలి: పవన్​

Pawan Kalyan Latest Comments: విజయనగరం జిల్లాలోని గుంకలాంలో జగనన్న కాలనీలపై జనసేన పార్టీ చేపట్టిన సోషల్‌ ఆడిట్‌లో జనసేన అధినేత పవన్ పాల్గొన్నారు. జగనన్న కాలనీలో అవినీతి జరుగుతుందంటూ ఆరోపణలు వస్తున్న సమయంలో పవన్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. జగనన్న కాలనీలను పరిశీలించిన అనంతరం పవన్‌ కల్యాణ్‌ గుంకలాం ప్రజలతో ముఖాముఖీ నిర్వహించారు.

ఉత్తరాంధ్ర యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని తెలిపిన పవన్ కల్యాణ్.. రాజధాని పేరిట ఉత్తరాంధ్రను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర ప్రజలు వైకాపా నాయకులు చేసే మోసాన్ని గ్రహించాలని వెల్లడించారు. ఉత్తరాంధ్రకు బలమైన రాజకీయ అధికారం దక్కాలని ఆకాంక్షించారు. జనసేనకు ఒక్క అవకాశం ఇస్తే మార్పు చూపిస్తామని వెల్లడించారు. యువత తన శక్తిని అవినీతి నిర్మూలనకు వినియోగించాలి పిలుపునిచ్చారు. తనపై నమ్మకముంచితే గుండాలతో పోరాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.

వైకాపా అంటే పార్టీ లు భయపడుతున్నాయని తెలిపారు. గుండాలు కోసం నేను పోరాడతానని తెలిపిన పవన్.. నాయకులు పని చెయ్యక పోతే తానే బాధ్యత వహిస్తానని వెల్లడించారు. తనను తిట్టే నాయకులకోసం దిల్లీకి వెళ్లె చెప్పుకొనని విమర్శించారు. ఇక పై కేసులు పెట్టినా.. చంపేస్తా అని చెప్పినా.. వెనక్కి తగ్గనంటూ వెల్లడించారు. ఉత్తరాంధ్ర నాయకులు సంగతి ఇక్కడి ప్రజలు చూసు కుంటారని తెలిపారు. తమకు ఓట్లు వస్తాయోలేదో తెలియదు.. అయినా నాయకులను నిలబెడతామని పవన్ పేర్కొన్నారు.

వైకాపా నాయకులకు ఎంత సేపు భూతులు తిట్టడం తప్ప మరో పని లేదు ఎద్దెవా చేశారు. ఎలాంటి ఉపాధి ఇస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయో ఆలోచన చేయడం లేదని విమర్శించారు. పదవులు కోసం పోరాడటం లేదని పవన్ పేర్కొన్నారు. మీ కాలనీ కి వైకాపా నేతలు వస్తే ఎప్పుడు ఇల్లు నిర్మిస్తారో చెప్పాలని గట్టిగా ప్రశ్నంచండని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. నేను దెబ్బ తిన్న పులి లాంటి వాడిని ..భయపడను నిలబడతానని పేర్కొన్నారు. ఏ సంక్షేమ పథకాలు తీసేయనని.. అలాగే అదనంగా ఆదాయ మార్గాలు పెంపొందిస్తాని పవన్‌ కల్యాణ్‌ వెల్లడించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.