ఎన్నికలకు మరో సంవత్సరం సమయం ఉన్నా... ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీలు రంగంలోకి దూకేందుకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్... వచ్చే ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు. త్వరలో వచ్చే ఎన్నికలకు పూర్తిస్థాయిలో సిద్ధమవుతున్నారు. త్వరలో యాత్ర నిర్వహించేందుకు ప్లాన్ చేస్తుండగా.. ఇందుకు సంబంధించిన వాహనం సిద్ధం అయింది. ఈ వాహనంలో జనసేనానిని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పర్యటించి ప్రభుత్వంపై పోరాడనున్నారు. తన ప్రచార వాహనానికి సంబంధించి పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.
ఈ వాహనానికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తూ.. ఎన్నికల యుద్ధానికి 'వారాహి సిద్ధం' అంటూ ఆయన క్యాప్షన్ ఇచ్చారు. వాహనం చుట్టూ బాడీ గార్డులు నడుచుకుంటూ.. వాహనం రెండు వైపులా ఇద్దరు నిల్చున్న వీడియోను పవర్‌ఫుల్‌గా చిత్రీకరించారు. వారహి వాహనాన్ని పరిశీలిస్తున్న ఫొటోలను కూడా ఆయన పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వాహనాన్ని ట్రయల్ రన్‌ను పవన్ కళ్యాణ్ బుధవారం హైదరాబాద్‌లో పరిశీలించారు. అసలు వారాహి అంటే... దుర్గాదేవి సప్త మాతృకల్లో ఒకరు. ఈ వాహనానికి వారాహి అని అమ్మవారి పేరు పెట్టారు. అన్ని దిక్కులను కాచే అమ్మవారిగా పురాణాలు చెబుతాయి. దుర్గా దేవి సప్త మాతృకల్లో వారాహి అమ్మవారు ఒకరు. ఆ సప్త మాతృకలు రక్త బీజుడు అనే రాక్షసుడిని సంహరించారు. అందుకే తన ప్రచార వాహనానికి పవన్ కల్యాణ్ వారాహి అని పేరు పెట్టారు. ఇక చూడాలి ఈ వాహనం అయినా... పవన్‌కు వచ్చే ఎన్నికల్లో విజయాన్ని ఇస్తుందో లేదో!!
ఇవీ చూడండి:
మేకిన్ ఇండియా పోయి ఊరూరా చైనా బజార్‌లొచ్చాయ్.. మోదీపై కేసీఆర్ సెటైర్స్