డిసెంబర్ 1న జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా సుపరిపాలనకే ఓటు వేయాలని జన్ సేవా సంఘ్ విజ్ఞప్తి చేసింది. ఎన్నికలు సర్కస్లాగా మారాయని... రాజకీయ నేతలు ప్రజలను తోలు బొమ్మలుగా మారుస్తున్నారని సంఘ్ నేతలు ఆరోపించారు. కులానికో... మతానికో... లేక మందుకో లేదా డబ్బుకో ఓటు వేయకుండా... స్వచ్ఛమైన పాలన కోసం ఓటు వేయాలని కోరారు.
మంచి అభ్యర్థి లేనిచోట నోటాకైనా ఓటు వేయాలని సూచించారు. రాజకీయ వృత్తితో కాకుండా సేవా, అంకిత భావం గల అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.
ఇదీ చదవండి: తెరాస బహిరంగ సభకు సర్వం సిద్ధం