ETV Bharat / state

'కశ్మీర్​ను సందర్శించండి...రాయితీ పొందండి' - jammu and kashmir Tourism Road Show at Hyderabad latest news

పర్యటనలకు జమ్ముకశ్మీర్ సురక్షితమైనదని అసోసియేషన్ ఆఫ్ కశ్మీర్ టూర్ ఆపరేటర్స్ ప్యాట్రన్​ చీఫ్​ నజీర్​ అహ్మద్​ అన్నారు. కశ్మీర్​ను సందర్శించే వారికి టూరిజం ఫీజులో రాయితీ కల్పిస్తామన్నారు.​

jammu and kashmir Tourism today news
jammu and kashmir Tourism today news
author img

By

Published : Feb 13, 2020, 9:43 AM IST

జమ్ముకశ్మీర్ పర్యాటక విభాగంతో కలిసి అసోసియేషన్ ఆఫ్ కశ్మీర్ టూర్ ఆపరేటర్స్ హైదరాబాద్​లో రోడ్ షో కార్యక్రమాన్ని నిర్వహించింది. జాతీయ నేర గణాంకాల సంస్థ లెక్కల ప్రకారం మహిళలకు సంబంధించి సున్నా క్రైమ్ రేటు ఉందని అసోసియేషన్ ప్యాట్రన్ చీఫ్ నజీర్ అహ్మద్ అన్నారు. జమ్ముకశ్మీర్​లో 12 నెలలు పర్యటించేందుకు అనువైన పరిస్థితులున్నాయని తెలిపారు. ప్రస్తుతం సంవత్సరానికి 12 లక్షల మంది జమ్ముకశ్మీర్​ను సందర్శిస్తున్నారని చెప్పారు. భవిష్యత్తులో పర్యటకుల సంఖ్య 25 లక్షలకు పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ నుంచి దాదాపు 150 మంది జమ్ముకశ్మీర్​కు టూర్లను అందిస్తున్నట్లు నజీర్​ అహ్మద్​ వెల్లడించారు.

'కశ్మీర్​ను సందర్శించండి...రాయితీ పొందండి'

ఇవీ చూడండి:ఉద్యోగులకు తీపికబురు - ఇకపై వారానికి 5 పని దినాలే

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.