జీహెచ్ఎంసీ ఎన్నికల నామినేషన్ వేసేందుకు తెరాస అభ్యర్తులు భారీ ర్యాలీలుగా వెళ్తున్నారు. హైదరాబాద్ అబిడ్స్ జీహెచ్ఎంసీ కార్యాలయానికి వెళ్లి జాంబాగ్ డివిజన్ తెరాస అభ్యర్థి ఆనంద్‌కుమార్ గౌడ్ నామినేషన్ దాఖలు చేశారు.
గతంలో జాంబాగ్ డివిజన్ నుంచి కేవలం 5 ఓట్ల తేడాతో ఆనంద్‌కుమార్ ఓడిపోయారు. ఆనంద్‌కుమార్.. గౌలిగూడలోని అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ హారతులు, డప్పు వాయిద్యాలతో భారీ ర్యాలీతో జీహెచ్ఎంసీ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు.
ఇదీ చదవండిః బేగంబజార్ తెరాస అభ్యర్థి పూజా వ్యాస్ నామినేషన్..