Jalamandali Warning Strict Action Taken if Manholes Opened in Hyderabad : హైదరాబాద్‌లోని రోడ్లపై ఉన్న మ్యాన్ హోళ్లు తెరిస్తే కఠిన చర్యలు ఉంటాయని జలమండలి అధికారులు హెచ్చరించారు. కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఈ సూచనలు చేసింది. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న తరుణంలో జలమండలి ఇప్పటికే అన్ని రకాల ముందు జాగ్రత్తలు తీసుకుంది. లోతైన మ్యాన్ హోళ్లతో పాటు.. 22,000కు పైగా మ్యాన్ హోళ్లపై (Manholes) ఇప్పటికే సేఫ్టీ గ్రిల్స్ బిగించారు.
Jaalmandali Officials Warning Peple Dont Opened Manholes : ప్రధాన రహదారుల్లో ఉన్న వాటిని కవర్లతో సీల్ చేసి రెడ్ మార్కు ఏర్పాటు చేశారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్- ఈఆర్టీ, మాన్‌సూన్ సేఫ్టీ టీమ్ - ఎమ్మెస్టీ, సేఫ్టీ ప్రోటోకాల్ టీమ్-ఎస్పీటీ వాహనాలను రంగంలోకి దింపారు. క్షేత్ర స్థాయిలో పనిచేసే సిబ్బందికి రక్షణ పరికరాలు అందించారు. ఈ బృందాలకు కేటాయించిన వాహనాల్లో జనరేటర్‌తో కూడిన డీ వాటర్ మోటార్ ఉంటుంది. ఈ యంత్రం సాయంతో వర్షపు నీరు తొలగిస్తారు. వీరంతా ఆయా ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహిస్తున్నారు.
ఫోన్ మాట్లాడుతూ మ్యాన్‌హోల్‌లో పడిన మహిళ- అదృష్టం కొద్దీ..
అధికంగా నీరు నిలిచే ప్రాంతాలపై ఈ బృందాలు ప్రధానంగా దృష్టి సారిస్తాయి. వీటితోపాటు ఎయిర్‌టెక్ మిషన్లు సైతం అందుబాటులో ఉంచారు. మ్యాన్ హోళ్ల నుంచి తీసిన వ్యర్థాలు - సిల్ట్ ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు. వీటిని పర్యవేక్షించడానికి ప్రతి సెక్షన్ నుంచి సీవర్ ఇన్‌స్పెక్టర్ నేతృత్వంలో ఒక సీవరేజీ బృందంను ఏర్పాటు చేశారు. వీరు ఉదయాన్నే క్షేత్ర స్థాయిలో తమ పరిధిలోని ప్రాంతాలకు వెళ్లి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
లీకేజీ, వాటర్ లాగింగ్ పాయింట్లు.. జీహెచ్ఎంసీ అధికారుల (GHMC Officials) సమన్వయంతో ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు. ఎక్కడైనా మ్యాన్ హోల్ మూత ధ్వంసమైనా.. తెరిచి ఉంచినట్లు గమనించినా లేదా ఇతర సమస్యలు, ఫిర్యాదులుంటే జలమండలి (Jaalmandali) కస్టమర్ కేర్ నంబర్ 155313కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని అధికారులు తెలిపారు. దగ్గరలోని వార్డు కార్యాలయాల్లోనూ నేరుగా సంప్రదించవచ్చని జలమండలి పేర్కొంది.
ఫోన్ మాట్లాడుతూ నిర్లక్ష్యం.. బిడ్డతో సహా మ్యాన్‌హోల్‌లో పడి..
HMWSSB Warning Strict Action Taken if Manholes Opened : ఎవరైనా పౌరులు, అనధికార వ్యక్తులు.. అధికారుల అనుమతి లేకుండా మ్యాన్ హోళ్లపై ఉన్న మూత తెరచినా లేదా తొలగించినా హెచ్ఎమ్‌డబ్ల్యూఎస్‌ఎస్‌బీ యాక్ట్- 1989, సెక్షన్ 74 ప్రకారం నేరమని జలమండలి అధికారులు తెలిపారు. ఈ నిబంధన అతిక్రమించి ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాంటి వారిపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని వివరించారు. నిందితులకు జరిమానా విధించడంతోపాటు కొన్ని సార్లు జైలు శిక్ష కూడా వేసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
మరోవైపు పారిశుద్ధ కార్మికులు, సిబ్బంది విధులు నిర్వర్తించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. అత్యవసర సమయాల్లో ఎలా పనిచేయాలనే విషయంపై జలమండలి ఏటా భద్రతా వారోత్సవాలు, పక్షోత్సవాలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాల్లో ఎస్వోపీ మార్గదర్శకాల ప్రకారం.. భద్రతా పరికరాల పనితీరు, ఉపయోగించే విధానం, పారిశుద్ధ్య పనుల్లో తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలపై శిక్షణ ఇస్తోంది. పని ప్రదేశాల్లో ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు చేసే ప్రథమ చికిత్సపై అవగాహన కల్పిస్తుంది.
HMWSSB On Sewerage Management : వర్షాకాలంలో సీవరేజి నిర్వహణలో సాధారణ పౌరులు ఎలా ప్రవర్తించాలి, ఎలా నడుచుకోవాలనే అంశాలపై కూడా విరివిగా జలమండలి ప్రచారం చేస్తుంది. స్థానిక కాలనీల సంఘాలు, ఎస్‌హెచ్ గ్రూపుల సభ్యులతో అవగాహన కల్పిస్తోంది. చేయాల్సిన, చేయకూడని పనులపై దినపత్రికలు, టెలివిజన్, ట్విటర్ ఎక్స్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం చేస్తున్నారు.
మ్యాన్‌హోల్‌లో దిగి కార్మికుడు మృతి... మరో ఇద్దరి పరిస్థితి విషమం