ETV Bharat / state

బిల్లుల వసూలుకు జలమండలి కీలక నిర్ణయం.. వారి నల్లా కనెక్షన్‌ కట్‌

మీరు నీటి బిల్లులు కట్టలేదా?.. అయితే వెంటనే చెల్లించండి. లేదంటే జలమండలి సిబ్బంది మీ ఇంటికొచ్చి నల్లా కనెక్షన్లు తొలగిస్తారు. బకాయిలు పేరుకుపోవడంతో వాటిని వసూలు చేయడానికి ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు జలమండలి ఎండీ దానకిశోర్‌ తెలిపారు.

jalamandali
jalamandali
author img

By

Published : Jan 5, 2023, 8:00 PM IST

ఏడాది కాలం, ఆపై నుంచి నల్లా బిల్లు చెల్లించని నాన్ డొమెస్టిక్.. నాన్ ఫ్రీ వాటర్ కనెక్షన్​ల బకాయిలను వసూలు చేయాలని అధికారులను జలమండలి ఎండీ దానకిశోర్ ఆదేశించారు. బిల్లులు చెల్లించకపోతే కనెక్షన్​లు తొలగించాలని తెలిపారు. ఖైరతాబాద్​లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో జలమండలి ఓ అండ్ ఎం, రెవెన్యూ, ఎంసీసీ.. సింగిల్ విండో తదితర అంశాలపైన అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.

ఎంసీసీకి వచ్చే ఫిర్యాదులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఎండీ దానకిశోర్​ అధికారుతో పేర్కొన్నారు. కలుషిత నీరు,మురుగు నీరు పొంగిపొర్లడం, మూతలు లేని మ్యాన్ హోల్స్​పై వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యమివ్వాలని చెప్పారు. దీర్ఘ కాలికంగా బకాయిలు చెల్లించడంలో మొండికేస్తున్న వారికి నోటీసులు జారీ చేయాలని అన్నారు. స్పందించని పక్షంలో వారి కనెక్షన్ తొలగించాలని స్పష్టం చేశారు.

అయితే డొమెస్టిక్ స్లమ్ వినియోగదారులను.. బిల్లు చెల్లింపు కోసం ఒత్తిడి చేయకూడదని సూచించారు. కొత్త కనెక్షన్ల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వెంటనే మంజూరు చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని దానకిశోర్ వెల్లడించారు.

ఇవీ చదవండి: 'రైతుల ఆందోళనపై స్పందించిన కేటీఆర్.. అభ్యంతరాలు స్వీకరించాలని సూచన

'రాత్రికి రాత్రే 50వేల మందిని వెళ్లగొట్టలేరు'.. ఉత్తరాఖండ్‌ మెగా కూల్చివేతలపై సుప్రీం స్టే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.