2024 నాటికి దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి సురక్షిత తాగునీటిని అందించాలన్న కేంద్ర ప్రభుత్వం లక్ష్యసాధనలో భాగంగా నలుగురు సభ్యుల జాతీయ బృందం తెలంగాణలో పర్యటిస్తోంది. ఈ నెల 17వ తేదీ నుంచి మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో క్షేత్ర స్థాయి పరిశీలన చేసింది. మిషన్ భగీరథ నీటి శుద్ధి కేంద్రాలు, ఇంటెక్ వెల్స్‌తో పాటు గ్రామాల్లో పర్యటించింది. ఈ సందర్భంగా ప్రజలను కలిసి అభిప్రాయాలు తెలుసుకుంది.
ఇవాళ ఎర్రమంజిల్‌లోని మిషన్ భగీరథ ప్రధాన కార్యాలయంలో మిషన్ భగీరథ ప్రాజెక్టు స్వరూపం, లక్ష్యాలను, భగీరథ ప్రాజెక్టు స్వరూపం, లక్ష్యాలను జల్ జీవన్ టాస్క్ ఫోర్స్‌కు అధికారులు వివరించారు. నల్గొండ ఫ్లోరైడ్ బాధితులకు సురక్షిత నీటిని సరాఫరా చేస్తున్న ఇంజనీర్లకు అభినందించారు.
ఇదీ చూడండి:- 'నాకు రాజకీయాలొద్దు.. నిర్భయ దోషులకు శిక్ష కావాలి'