ఏపీలోని గుంటూరు జిల్లా తుళ్లూరులో జరిగిన ఓ వివాహ రిసెప్షన్ వేడుకలో జై అమరావతి నినాదాలు మారు మోగాయి. వేడుక ఏదైనా సరే.... అమరావతి వాసుల నినాదం ఒక్కటే.. అదే జై అమరావతి... అందరిలో ఉత్సాహాన్ని నింపారు అక్కడి మహిళలు, రైతులు.
వారి నినాదాలకు వధూవరులు సైతం గొంతు కలిపారు. అమరావతి ఉద్యమానికి అక్కడున్నవారంతా ముక్త కంఠంతో మద్దతు పలికారు. రాజధాని కోసం రైతులు చేసిన త్యాగాలు గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఇదీ చదవండి: పులుల సంచారంపై ఎంపీ సోయం సంచలన వ్యాఖ్యలు