'ఎమ్మెల్యేలకు ఎర' కేసులో కీలక నిందితుడు జగ్గు స్వామి రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. కేరళలో ఉంటున్న జగ్గు స్వామిపై సిట్ వేట మొదలుపెట్టడంతో.. అక్కడి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని జగ్గు స్వామి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సిట్ నోటీసులు, లుకౌట్ నోటీసులపై స్టే ఇవ్వాలని క్వాష్ పిటిషన్ వేశారు. జగ్గు స్వామి పిటిషన్ హైకోర్టులో సోమవారం విచారణకు వచ్చే అవకాశముంది.
ఇవీ చూడండి..
'ఎమ్మెల్యేలకు ఎర' కేసు.. తుషార్, జగ్గుస్వామి వేటలో సిట్ బృందాలు
కొచ్చి నుంచి కొల్లాంకి మారిన సిట్ వేట.. ఆ కేసులో అన్ని ట్విస్ట్లే!!