Jaggery Health Benefits in Telugu : జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారా...? దానికి చక్కటి పరిష్కారం బెల్లమే..... మలబద్ధకం వేధిస్తోందా..? దానికి బెల్లమే పరిష్కారం..! నెలసరి నొప్పులు తట్టుకోలేకపోతున్నారా..? దీనికి బెల్లమే పరిష్కారమండీ.. !..... ఇలా చెప్పుకుంటూ పోతే బెల్లం తింటే నయం కాని అనారోగ్యమంటూ ఉండదు అంటే నమ్ముతారా..? కానీ అదే నిజం. కాకపోతే ఈ బెల్లాన్ని నేరుగా తినడం కంటే.. కొన్ని పదార్థాలతో కలిపి తీసుకుంటే దానిలో ఉండే సుగుణాలు రెట్టింపు అవుతాయంటున్నారు పోషకాహార నిపుణులు. తద్వారా ఆయా ఆరోగ్య సమస్యల్ని తగ్గించడంలో బెల్లం మరింత ప్రభావవంతంగా పని చేస్తుందని అంటున్నారు. బెల్లాన్ని ఏయే పదార్థాలతో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంతో తెలుసుకుందాం రండి.
Vitamin C Deficiency in Telugu : విటమిన్ సి లోపం ఉందా.. ఇవి తింటే చెక్ పెట్టేయొచ్చు
క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం.. వంటి ఎన్నో ఖనిజాలు.. బి- కాంప్లెక్స్, సి, డి2, ఇ... వంటి విటమిన్లు నిండి ఉన్న బెల్లాన్ని తీసుకుంటే శరీరానికి ఎంతో మంచిది. దీన్ని తినడం వల్ల బీపీని అదుపు చేస్తుంది. శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. నెలసరి నొప్పుల నుంచి ఉపశమనం కలిగించడంతో పాటు రక్తహీనతను తగ్గిస్తుంది.. ఇలా బెల్లం చేసే మేలు ఎన్నో!
Banana Health Benefits : అరటిపండుతో గుండె పదిలం.. టెన్షన్, మలబద్ధకానికి చెక్!
బెల్లాన్ని ఇలా తీసుకుంటే బోలెడన్ని ప్రయోజనాలు!
- బెల్లాన్ని నెయ్యితో కలిపి తీసుకుంటే మలబద్ధకం నుంచి విముక్తి పొందవచ్చు
- బెల్లాన్ని ధనియాలతో కలిపి తీసుకోవడం వల్ల నెలసరి సమయంలో అధిక రక్తస్రావం నుంచి విముక్తి పొందవచ్చు. నెలసరి నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. స్పాటింగ్ మాత్రమే అవుతోందని బాధపడే వారికి ఆ సమస్య తగ్గి ఎప్పటి మాదిరిగానే పిరియడ్స్ ప్రారంభమవుతాయి.
- బెల్లంతో సోంపును కలిపి తీనడం వల్ల నోటి నుంచి దుర్వాసన రాదు. దీంతోపాటు దంతాలపై పాటి పేరుకోకుండా సహాయపడుతుంది.
- మెంతులు బెల్లం కలిపి తీసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యం రెట్టింపవుతుంది. వెంట్రుకల కుదుళ్లు దృఢంగా మారతాయి. తెల్ల జుట్టు రాకుండా సహాయపడుతుంది.
- బెల్లంతో గోంద్ కలిపి తినడం వల్ల ఎముకల్ని దృఢంగా చేయడానికి ఈ కాంబినేషన్ బాగా ఉపకరిస్తుంది. ఈ మిశ్రమాన్ని పాలిచ్చే తల్లులు తీసుకుంటే చనుబాలు పుష్కలంగా ఉత్పత్తవుతాయి.
- ఆలీవ్ గింజలతో బెల్లాన్ని కలిపి తినడం వల్ల మనం తీసుకునే ఆహారంలోని ఫోలికామ్లం, ఐరన్‌ను శరీరం త్వరగా గ్రహించేందుకు ఈ మిశ్రమం తోడ్పడుతుంది. దీన్ని తినడం వల్ల చర్మంపై ఏర్పడిన పిగ్మెంటేషన్‌ని తగ్గించడంతో పాటు జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.
- బెల్లాన్ని నువ్వులతో కలిపి తీసుకోవడం వల్ల దగ్గు, జలుబు, ఫ్లూ వంటివి దరిచేరకుండా కాపాడుతుంది.
- పల్లీలను బెల్లంతో కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో సత్తువను పెంచడానికి దోహదపడుతుంది. అలాగే ఆకలిని అదుపు చేయడానికి... ఆహారపు కోరికల్ని తగ్గించడానికి ఈ ఫుడ్ కాంబినేషన్ బాగా పని చేస్తుంది.
- బెల్లాన్ని పసుపుతో కలిపి తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
- బెల్లం శొంఠి పొడి కలిపి తినడం వల్ల జ్వరం నుంచి త్వరగా కోలుకుంటారు. శరీరంలోని వాపును తగ్గించడానికి ఇది సహాయపడుతుంది.
Milk Before Bed Is Good Or Bad : నిద్రపోయే ముందు పాలు తాగుతున్నారా? ఎన్ని సమస్యలు వస్తాయో తెలుసా?
High Protein Diet Health Benefits : హై ప్రోటీన్ ఫుడ్‌తో.. స్థూలకాయం సహా.. బీపీ, షుగర్లకు చెక్!