తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మంత్రి హరీశ్‌రావును సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కలిశారు. దాదాపు 14 ఏళ్ల తర్వాత తొలిసారి నియోజకవర్గ ప్రజల కోసం మంత్రితో మాట్లాడినట్లు జగ్గారెడ్డి వెల్లడించారు. దాదాపు అరగంటపాటు ఆయనతో చర్చలు జరిపారు. సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గ అభివృద్ది కోసం హరీష్‌రావు సానుకూలంగా స్పందించారని జగ్గారెడ్డి పేర్కొన్నారు.
ఇవీచూడండి: రైతులు నిశ్చింతగా ఉండొచ్చుః సీఎం కేసీఆర్