ETV Bharat / state

ప్రభుత్వ వైఫల్యాలను రథయాత్రలో ఎండగడతాం : జగ్గారెడ్డి - తెలంగాణ కాంగ్రెస్​ కమిటి

పురపాలక ఎన్నికలు దగ్గర పడుతున్నందున రథయాత్ర ద్వారా ప్రజల వద్దకు వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి ఉత్తుత్తి హామీలపై ప్రజల్లోకి వెళ్లాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలకు చెప్పినట్లు ఆయన వెల్లడించారు.

Jaggareddy Calls For Congress Rathayatra in Telangana
ప్రభుత్వ వైఫల్యాలను రథయాత్ర ద్వారా ఎండగడతాం : జగ్గారెడ్డి
author img

By

Published : Aug 23, 2020, 9:33 PM IST

పురపాలక ఎన్నికలు దగ్గర పడుతున్నందున రథయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని కాంగ్రెస్​ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలతో చర్చించినట్టు ఆయన తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో రెండు పడకల ఇళ్లు ఇస్తామన్నారని.. వాటి ఊసే లేదని, రైతుల రుణమాఫీ, నిరుద్యోగ భృతి వంటి తెరాస ఎన్నికల హామీలపై ప్రజలను చైతన్యపరుస్తామని.

తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న తెరాస కుట్రలను బహిర్గతం చేస్తామని తద్వారా కాంగ్రెస్​ పార్టీ బలోపేతానికి మార్గం సుగమం అవుతుందని ఆయన తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు రేవంత్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలతోపాటు ఐదుగురు కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్‌ నాయకుల సహకారంతో రథయాత్ర చేపట్టి తెరాస ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతామని తెలిపారు. కరోనా నేపథ్యంలో పాదయాత్ర చేయడం ఇబ్బంది ఉంటుందన్న ఆలోచనతో రథయాత్ర చేపట్టి ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించామన్నారు. మొదటి విడత పురపాలక సంఘాల్లో, రెండో విడత మండలాలు, గ్రామాల్లో రథయాత్ర నిర్వహిస్తామని తెలిపారు.

ఇదీ చూడండి: గణేషుడికీ ఓ పార్కు, మ్యూజియం ఉన్నాయి.. అవి ఎక్కడో తెలుసా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.