ETV Bharat / state

బార్ల లైసెన్సులు రద్దు.. ఉత్తర్వులు జారీ...

మద్యపాన నిషేధం దిశగా ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచింది. ప్రస్తుతమున్న అన్ని బార్ల లైసెన్సులు రద్దు చేస్తూ... ఉత్తర్వులు జారీ చేసింది. 40 శాతం బార్లు తగ్గించి... మళ్లీ లైసెన్సులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అన్ని బార్ల లైసెన్సులు రద్దు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
author img

By

Published : Nov 22, 2019, 10:33 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని అన్ని బార్ లైసెన్సులనూ రద్దు చేస్తూ... ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ఎక్సైజ్​ చట్టం 1968లోని సెక్షన్ 32 ప్రకారం... బార్ లైసెన్సులను వాపసు తీసుకుంటున్నట్టు రెవెన్యూ శాఖ ఈ ఆదేశాలు ఇచ్చింది. 40 శాతం మేర బార్లను తగ్గించి... కొత్త లైసెన్సులు జారీ చేయాలని సర్కారు నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 830 బార్ లైసెన్సులు... ఈ ఉత్తర్వులతో రద్దయ్యాయి. 38 నక్షత్ర హోటళ్లు, 4 మినీ బ్రూవరీస్ మినహా... అన్ని లైసెన్సులనూ ప్రభుత్వం రద్దు చేసింది. మద్యపాన నిషేధం అమల్లో భాగంగా 40 శాతం మేర కుదించి... కొత్త లైసెన్సులు జారీ చేయనున్నారు.

లైసెన్సు ఫీజు భారీగా పెంపు..!
బార్ లైసెన్సులను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం... కొత్త బార్ పాలసీనీ ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి ఇది అమల్లోకి వస్తుందని ప్రకటించింది. 2020 జనవరి 1 నుంచి ఈ బార్ పాలసీ అమలు కానుంది. రెండేళ్ల కాలపరిమితితో నూతన లైసెన్సులు జారీ కానున్నాయి. కొత్త విధానం ప్రకారం లైసెన్సు ఫీజును రూ.10 లక్షలుగా నిర్ధరిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. లాటరీ ద్వారా మాత్రమే బార్ల కేటాయింపులు జరుగుతాయని స్పష్టం చేసింది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ మాత్రమే బార్లు పనిచేయాల్సి ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. వీటితో పాటు బార్లలో మద్యం అమ్మకాలపై అదనపు పన్ను విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఇవీ చదవండి

పరిహారం కోసం 'సజీవ సమాధి'తో రైతుల నిరసన

జనవరి లేదా ఫిబ్రవరి నుంచి రచ్చబండ.. సీఎం జగన్​ నిర్ణయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.